Wholesale Markets: ఈ మార్కెట్లలో డ్రెస్సుల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతీది చీప్‌ రేట్‌కే లభిస్తాయి.. వివరాలు మీకోసం..

|

Feb 11, 2023 | 9:20 AM

తక్కువ ధరకే డ్రెస్సులు, స్మార్ట్ ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్స్ లభిస్తున్నాయంటే ఎవరు మాత్రం వొద్దంటారు చెప్పండి. ప్రస్తుత కాలంలో ప్రతీ వస్తువుకు భారీగా ధరలు పెరిగిపోయాయి.

Wholesale Markets: ఈ మార్కెట్లలో డ్రెస్సుల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతీది చీప్‌ రేట్‌కే లభిస్తాయి.. వివరాలు మీకోసం..
Follow us on

తక్కువ ధరకే డ్రెస్సులు, స్మార్ట్ ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్స్ లభిస్తున్నాయంటే ఎవరు మాత్రం వొద్దంటారు చెప్పండి. ప్రస్తుత కాలంలో ప్రతీ వస్తువుకు భారీగా ధరలు పెరిగిపోయాయి. దాంతో ఏది కొనుగోలు చేయాలన్నా వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అత్యంత తక్కువ ధరకు డ్రెస్సులు, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్, ఇతర వస్తువులు లభించే ప్లేసెస్ గురించి మీకు తెలియజేస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో నివసించే వారికి ఈ హోల్‌సేల్ మార్కెట్స్ చాలా దూరమైనప్పటికీ.. ఢిల్లీ వెళ్లేవారు చాలా మందే ఉంటారు.

ఇవాళ మనం దేశ రాజధానిలోని ఢిల్లీలో గల కొన్ని ప్రత్యేక హోల్ సేల్ మార్కెట్‌ల గురించి తెలుసుకుందాం. ఈ మార్కెట్లలో చాలా తక్కువ ధరలకే, మన్నికైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరకే బ్రాండెడ్ డ్రెస్సులు కొనాలనుకుంటే, ఉపయోగకరమైన గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా ఈ మార్కెట్లలో చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. ఈ మార్కెట్లలో తక్కువ ధరలకే వస్తువులు లభిస్తాయి. మరి ఆ మార్కెట్లు ఏంటో చూద్దాం.

1. గాంధీ నగర్ మార్కెట్..

ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్ దుస్తులకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ మంచి నాణ్యమైన దుస్తులు లభిస్తాయి. మీరు తక్కువ ధరలో ఎక్కువ డ్రెస్సులు తీసుకోవాలనుకుంటే ఈ మార్కెట్‌కు వెళ్లడం ఉత్తమం. ఒకవేళ మీరు ఢిల్లీకి వెళితే ఈ మార్కెట్‌కు వెళ్లి తక్కువ ధరకే డ్రెస్సులు కొనుగోలు చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

2. చాందినీ చౌక్..

వివాహాది శుభకార్యాలకు డ్రెస్సులు కొనుగోలు చేయాలనుకుంటే.. చాందినీ చౌక్ మంచి మార్కెట్. ఢిల్లలోని చాందినీ చౌక్‌లో అతి తక్కువ ధరకే దుస్తులు, పాదరక్షలు, ఇతర అనేక వస్తువులు అందుబాటులో ఉంటాయి.

3. కరోల్ బాగ్ మార్కెట్..

ఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్ చవకైన గాడ్జెట్‌లు, ఇతర డిజిటల్ పరికరాలకు బాగా ఫేమస్. ఇక్కడ ఇయర్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్, కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గ్యాడ్జెట్స్‌ని హోల్ సేల్ ధరలకే కొనుగోలు చేయొచ్చు.

4. చావ్రీ బజార్..

రాగి, ఇత్తడి పాత్రలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తే. ఢిల్లీలోని చావ్రీ మార్కెట్‌ను సందర్శించవచ్చు. ఇక్కడ రాగి, ఇత్తడి పాత్రలను చౌక ధరలకు విక్రయిస్తారు. అంతేకాదు, వివాహ ఆహ్వాన పత్రికలు, ఇతర కార్డ్స్ కూడా తక్కువ ధరకే ప్రింటింగ్ చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..