
కేంద్రం పాటిస్తున్న వ్యాక్సినేషన్ పాలసీలో చాలా లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. ధరల్లో వ్యత్యాసం, వ్యాక్సిన్ కొరత, గ్రామీణ ప్రాంతాలకు టీకామందులు చేరని పరిస్థితి, 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ లో జాప్యం..ఇలా పలు అంశాలపై కేంద్రాన్ని కోర్టు ‘కడిగిపారేసింది’. మేము లేవనెత్తిన అంశాలకు రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. ఈ సంవత్సరాంతానికల్లా దేశ జనాభాలో చాలామందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయగలుగుతామని మీరు అంటున్నారని, కానీ వివిధ వయస్సులవారికి వ్యాక్సిన్ సప్లయ్ లో తేడాతో బాటు ఎన్నో అవరోధాలు కనిపిస్తున్నాయని కోర్టు పేర్కొంది. కేంద్రం కన్నా రాష్ట్రాలు ఎందుకు అధికంగా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది ? 465 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయస్సు వారికి మీరు వ్యాక్సిన్ ప్రొక్యూర్ చేస్తున్నారు..కానీ 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి దీన్ని వేర్వేరుగా ఎందుకు విభజించారు ? ఇలా ఎందుకు..ఏ ప్రాతిపదికన నిర్ణయించారు అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులనుంచి రాష్ట్రాలకు 50 శాతం అందుతోందని, ధరను మీరే (కేంద్రమే( నిర్ణయిస్తున్నారని, మిగతా 50 శాతం వ్యాక్సిన్ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తోందని, దీనికి కచ్చితమైన బేసిస్ అంటూ ఏమిటని కూడా వారు అన్నారు. స్పుత్నిక్ నుంచి ముంబై బిడ్స్ అందుకుంది, అంటే ఒక్కో రాష్ట్రాన్ని మీరు ఇలా వదిలేస్తున్నారా లేక మొత్తం దేశానికంతటికీ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న మాట మరిచిపోతున్నారా అని కూడా జడ్జీలు రెట్టించి ప్రశ్నించారు.
ఆ మధ్యఆక్సిజన్ కొరతపై కూడా అత్యున్నత న్యాయస్థానం ఇలాగే కేంద్రం మీద తీవ్రంగా విరుచుకుపడింది. మీరు అనుసరిస్తున్న పాలసీ సరిగా లేదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. 24 గంటల్లోగా ఢిల్లీ లోని ఆసుపత్రులకు ఆక్సిజన్ అందేలా చూడాలని ఆదేశించడంతో కేంద్రం ఆగమేఘాల మీద ఇందుకు పూనుకొంది.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : Viral Video : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..!కాబోయే వాడిని భలే బురిడీ కొట్టించిన యువతి.. ఆకట్టుకుంటోన్న ప్రాంక్ వీడియో..
విద్యుత్ తీగలపై వాక్‌చేస్తోన్న శునకం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.: Dog Viral video.
పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ ఆన్సర్ వైరల్ వీడియో : Renu Desai Viral video.