Delhi Towers: కూలడానికి సిద్ధంగా ఉన్న 40 అంతస్తుల ట్విన్ టవర్స్.. చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు..

|

Mar 16, 2022 | 7:20 AM

Delhi Towers: మే 22న 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ ఒక్కపెట్టున కూలనున్నాయి. అందుకోసం 4 టన్నుల పేలుడు పదార్థాలు వినియోగించనున్నారు.

Delhi Towers: కూలడానికి సిద్ధంగా ఉన్న 40 అంతస్తుల ట్విన్ టవర్స్.. చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు..
Towers
Follow us on

Delhi Towers: మే 22న 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ ఒక్కపెట్టున కూలనున్నాయి. అందుకోసం 4 టన్నుల పేలుడు పదార్థాలు వినియోగించనున్నారు. దాదాపు 100 మీటర్ల పొడవైన ఆ భవనాలు కూల్చివేసేందుకు పట్టే సమయం కేవలం 9 సెకన్లే. వాటిని ఎందుకు కూల్చివేయాల్సి వస్తోంది? తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.

ఉత్తర్‌ప్రదేశ్‌ పరిధిలోని నొయిడాలో సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్ టెక్‌ లిమిటెడ్ కంపెనీ 2009లో ట్విన్‌ టవర్స్‌ ప్రాజెక్టు చేపట్టింది. అయితే వాటి నిర్మాణం విషయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 40 అంతస్తుల ట్విటర్ టవర్స్‌ కూల్చివేయాలని ఆదేశించింది. అందులో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. వీటిని కూల్చివేసేందుకు మే 22న మధ్యాహ్నం 2.30 గంటలకు సమయం ఫిక్స్ చేశారు. అధికారులు ఆ బాధ్యతను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ చేతిలో పెట్టారు. ఈ టవర్స్‌ను కూల్చివేసేందుకు 2,500 నుంచి 4,000 కిలోల పేలుడు పదార్థాలు అవసరమవుతాయని అంచనా. అంతటి భారీ నిర్మాణాల కూల్చివేతకు కేవలం 9 సెకన్లు మాత్రమే పడుతుందని సంస్థ అధికారులు తెలిపారు. ‘పేలుడు ప్రారంభం కాగానే ఆ టవర్స్‌ వివిధ దశల్లో అంతస్తుల వారీగా లోపలికి పడిపోతాయి. 10 స్థాయులు ప్రైమరీ బ్లాస్ట్ ఫ్లోర్‌లుగా, ఏడు స్థాయులు సెకండరీ బ్లాస్ట్ ఫ్లోర్‌లుగా పనిచేస్తాయి. ప్రైమరీ బ్లాస్ట్‌ ఫ్లోర్‌లలో అన్ని నిలువు వరుసల్లో పేలుడు పదార్థాలు ఉంటాయి.

సెకండరీ బ్లాస్ట్‌ ఫ్లోర్‌లలో 40 శాతం నిలువు వరుసల్లోనే పేలుడు పదార్థాలుంటాయి’ అంటూ ఆ ప్రక్రియను వివరించింది ఆ సంస్థ. మార్చి చివరి వారం లేక ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్‌ బ్లాస్ట్ జరగనుంది. ఇప్పటికే అంతస్తుల్లో అమర్చిన తలుపులు, కిటకీలు, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు తదితరాలను తొలగిస్తున్నారు. ఈ పేలుడు వల్ల ఏర్పడే శిథిలాలను తగ్గించేందుకు గోడల్ని కూల్చివేయనున్నారు. ఒకవేళ శిథిలాలు విసిరినట్లు పడినా ఎలాంటి ప్రమాదం జరకుండా ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూల్చివేత వల్ల కలిగే ప్రకంపనలు తగ్గించేందుకు నేలపై కుషన్లు అమర్చనున్నారు. ట్విన్ టవర్స్‌కు దగ్గర్లో వందల సంఖ్యలో కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ పేలుళ్ల కారణంగా ఇతర భవనాలకు ఎలాంటి హాని జరగదని నిపుణులు హామీ ఇచ్చారని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే బీమా సౌకర్యం ఉందని నొయిడా అథారిటీ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ కోసం ఒక ఎక్స్‌క్లూజన్‌ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొన్నిగంటలపాటు ఎవరినీ ఆ జోన్‌లోకి రానివ్వరు. అలాగే ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. ఎడిఫైస్ సంస్థ 2019లో 108 మీటర్ల పొడవైన బ్యాంక్‌ లిస్బన్ టవర్‌ను కూల్చివేసింది. అది దక్షిణాఫ్రికాలోని జోహనెస్‌బర్గ్‌లో ఉండేది.

Also read:

SBI PO Final Result 2022: ఎస్బీఐ పీవో రిక్రూట్‌మెంట్‌ ఫైనల్‌ రిజల్ట్ విడుదల.. ఫలితాలు ఇలా తెలుసుకోండి..!

Indian Army Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివిన వారికి గొప్ప అవకాశం.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్..

Viral Video: పెట్రోల్ ధరల కంటే గుర్రం దాణా ఖర్చులే తక్కువ.. బైక్ కు ప్రత్యామ్నాయంగా అశ్వం