ఏంటి అక్కా.! ఇలా చేశావ్.. టెస్ట్ డ్రైవ్ చేస్తూ కారుతో పాటు మొదటి అంతస్తు నుంచి..

ఢిల్లీలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణ్ విహార్ ప్రాంతంలో టెస్ట్ డ్రైవ్ సందర్భంగా కారు షోరూమ్‌కు వచ్చిన ఒక మహిళ గాజు పగలగొట్టి మొదటి అంతస్తు నుంచి కారుతో పాటు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మహిళకు గాయాలయ్యాయి. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది.

ఏంటి అక్కా.! ఇలా చేశావ్.. టెస్ట్ డ్రైవ్ చేస్తూ కారుతో పాటు మొదటి అంతస్తు నుంచి..
Thar 2[1]

Updated on: Sep 09, 2025 | 8:28 PM

ఢిల్లీలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణ్ విహార్ ప్రాంతంలో టెస్ట్ డ్రైవ్ సందర్భంగా కారు షోరూమ్‌కు వచ్చిన ఒక మహిళ గాజు పగలగొట్టి మొదటి అంతస్తు నుంచి కారుతో పాటు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మహిళకు గాయాలయ్యాయి. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది. షోరూమ్ ముందు మెరిసే కొత్త కారు తలక్రిందులుగా పడి ఉన్నట్లు కనిపించింది.

ఒక మహిళ కారు కొనడానికి నిర్మాణ్ విహార్ ప్రాంతంలో ఉన్న మహీంద్రా షోరూమ్‌కు వచ్చింది. ఈ సమయంలో, ఆమె షోరూమ్ మొదటి అంతస్తులో థార్ టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా, ఆమె కారులో కూర్చుని వేగంగా యాక్సిలరేటర్ తొక్కింది. దీని తరువాత, కారు షోరూమ్ గాజు అద్దాలను పగులగొట్టుకుంటూ.. మొదటి అంతస్తు నుండి ఫుట్‌పాత్‌పై పడిపోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్రు కలకలం సృష్టించింది. ఆ మహిళను కాపాడటానికి అందరూ కారు వైపు పరిగెత్తారు.

తీవ్రంగా గాయపడ్డ మహిళను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత ఒక వీడియో కూడా బయటపడింది. ఇందులో మహీంద్రా షోరూమ్ ముందు థార్ కారు తలక్రిందులుగా పడి ఉంది. ఈ సమయంలో, పెద్ద సంఖ్యలో జనం సంఘటన స్థలంలో గుమిగూడారు. ప్రస్తుతం, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు..

షోరూమ్ బయట జనాలు ఉంటే వారి ప్రాణాలకు ప్రమాదం ఉండేది. కారు కింద పడగానే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయని చెబుతున్నారు. దీనివల్ల ఆ మహిళ ప్రాణాలను కాపాడారు. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆమె ప్రాణాలు కూడా కోల్పోయేది. ప్రస్తుతం, ప్రథమ చికిత్స తర్వాత, ఆ మహిళను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..