Swati Maliwal : ఆప్‌ నేతలపై మరో బాంబు పేల్చిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్.. ఈసారి ఏమన్నారంటే..?

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణల కేసు దేశవ్యాప్తంగా సంచలన కలిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆయన పార్టీ ఆప్ కూడా చిక్కుల్లో పడింది. తాజాగా స్వాతి మలివాల్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌ దుమారం రేపుతోంది.

Swati Maliwal : ఆప్‌ నేతలపై మరో బాంబు పేల్చిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్.. ఈసారి ఏమన్నారంటే..?
Rajya Sabha Member Swati Maliwal

Updated on: May 22, 2024 | 2:12 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణల కేసు దేశవ్యాప్తంగా సంచలన కలిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆయన పార్టీ ఆప్ కూడా చిక్కుల్లో పడింది. తాజాగా స్వాతి మలివాల్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌ దుమారం రేపుతోంది. తనకు పార్టీకి చెందిన ఓ పెద్ద నాయకుడి నుంచి కాల్ వచ్చిందని, తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆప్‌ నేతలు కుట్రలు పన్నుతున్నారని స్వాతి తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

తన వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని స్వాతి మలివాల్ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. తనకు ఎవరు మద్దతిస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తారని చెబుతున్నారన్నారు. తనపై అభ్యంతరకర ఆరోపణలు చేయాలంటూ పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెంచుతున్నారని చెప్పారు. తనను వ్యక్తిగత అభాసుపాలు చేసేందుకు ఆప్ పార్టీ ముఖ్యనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

తనపై అసభ్యకరంగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడాలంటూ కొందరికి డ్యూటీ చేశారని, ట్వీట్ చేసే బాధ్యత మరొకరికి వచ్చిందని రాశారు. అమెరికాలో కూర్చున్న వాలంటీర్లను పిలిపించి తనపై ఏదో ఒకటి మాట్లాడాలంటూ ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. కొన్ని నకిలీ స్టింగ్ ఆపరేషన్‌ను సిద్ధం చేయాలంటూ మరికొందరిని రంగంలోకి దింపారని, ఇలా వేల మంది సైన్యాన్ని పెంచుతున్నారు, ఒంటరిగా ఎదుర్కుంటానని, నిజం నా దగ్గర ఉంది. వారిపై నాకు ఎలాంటి కోపం లేదు, నిందితుడు చాలా శక్తిమంతుడు. పెద్ద నాయకుడైనా అతడికి భయపడేదీ లేదని స్వాతి మలివాల్ తేల్చి చెప్పారు.

స్వాతి మలివాల్ కూడా అదే పోస్ట్‌లో తనకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఎవరికీ లేదని రాశారు. ఎవరి నుంచి ఏమీ ఆశించను. ఆత్మగౌరవం కోసం నేను పోరాటం ప్రారంభించాను, నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈ పోరాటంలో నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను కానీ నేను వదులుకోను. అంటూ రాసుకొచ్చారు.

వాస్తవానికి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ విభవ్ కుమార్ తనతో అనుచితంగా ప్రవర్తించారని, మే 13న సీఎం నివాసంలో తనను కొట్టారని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా మహిళా కమిషన్‌ కూడా ఈ విషయాన్ని స్వయంగా స్వీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని మే 18 శనివారం అరెస్టు చేశారు. అనంతరం స్థానిక కోర్టు అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…