Delhi Air Pollution: దీపావళి పండుగ అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. రాజధానిలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించినా.. అన్ని ప్రాంతాల్లో ప్రజలు టపాసులను కాల్చారు. దీంతో ఢిల్లీని వాయు కాలుష్యం ముంచెత్తింది ఢిల్లీ, ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పూసా రోడ్డులోనూ గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఢిల్లీలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 382 వరకు ఉంది. అయితే.. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500 దాటింది. ఢిల్లీలో పూసారోడ్డు వద్ద 505 కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఏక్యూఐ 500 దాటిందంటే కాలుష్యం ప్రమాదస్థాయికి చేరినట్లేనని అధికారులు తెలిపారు.
Thick smog covers #Delhi sky, visibility reduced; overall air quality in ‘very poor’ category pic.twitter.com/myx0Jhmqlt
— ANI (@ANI) November 5, 2021
Thick smog shrouds Noida, visibility reduced pic.twitter.com/AhZFG7ylCT
— ANI UP (@ANINewsUP) November 5, 2021
AQI ఎంత ఉంటే మంచిది?
– 0-50: మంచిగా ఉన్నట్లు
– 51 – 100: సంతృప్తికరం
– 101-200: మధ్యస్తం
– 201 – 300: పూర్
– 301 – 400: వెరీ పూర్
– 401 – 500: గాలి నాణ్యత తీవ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు.
Also Read: