Republic Day Violence: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. దీప్‌ సిద్ధూను ఎర్రకోటకు తీసుకెళ్లిన పోలీసులు.. ఎందుకంటే..?

|

Feb 13, 2021 | 6:31 PM

Republic Day Violence: భారత గణతంత్ర దినోత్సవం రోజున చోటు చేసుకున్న హింసాత్మక పరిణామాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ పోలీసులు మరో ముందడుగు వేశారు.

Republic Day Violence: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. దీప్‌ సిద్ధూను ఎర్రకోటకు తీసుకెళ్లిన పోలీసులు.. ఎందుకంటే..?
Follow us on

Republic Day Violence: భారత గణతంత్ర దినోత్సవం రోజైన జనవరి 26వ తేదీన చోటు చేసుకున్న హింసాత్మక పరిణామాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ పోలీసులు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న నటుడు దీప్ సిద్ధూ సహా ఇక్బాల్ సింగ్‌ను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా వారిద్దరినీ ఎర్రకోట వద్దకు పోలీసులు తీసుకువెళ్లారు. రిపబ్లిక్ డే రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడానికి గల కారణాలపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగానే దీప్ సిద్ధూ సహా, ఇక్బాల్ సింగ్‌ను పోలీసులు ఎర్రకోట వద్దకు తీసుకువెళ్లారు. అయితే, వీరిద్దరినీ ఎర్రకోటకు తీసుకువెళ్తున్న తరుణంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వారిపై కొన్ని వర్గాల వారు దాడి చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. పటిష్టమైన భద్రత మధ్య వారిని ఎర్రకోటకు తరలించారు. కాగా, రైతుల ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం వెనుక కీలక సూత్రధారి దీప్ సిద్ధూనే అని పోలీసులు తెలిపారు.

Also read:

ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ పంచాయతీల్లో రీ ఎలక్షన్స్‌ నిర్వహించాలని కోరిన వర్ల, బోండా

AP Local Body Elections: ఓటేసిన సర్పంచ్ అభ్యర్థి.. ఆ కొద్దిసేపటికే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఎక్కడంటే..