Delhi Drug: అమ్మ బాబోయ్..! ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ కలకలం.. రూ.2000 కోట్ల విలువైన కొకైన్ సీజ్‌

|

Oct 02, 2024 | 5:37 PM

దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ బయటపడటం కలకలం రేపుతోంది. దాదాపు 560 కిలోలకు పైగా కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. వీటి విలువ .2వేల కోట్లు ఉంటుందని అంచనా.

Delhi Drug: అమ్మ బాబోయ్..! ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ కలకలం.. రూ.2000 కోట్ల విలువైన కొకైన్ సీజ్‌
Delhi Drugs
Follow us on

దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ బయటపడటం కలకలం రేపుతోంది. దాదాపు 560 కిలోలకు పైగా కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. వీటి విలువ .2వేల కోట్లు ఉంటుందని అంచనా. సౌత్‌ ఢిల్లీలో సోదాలు జరిపిన పోలీసులు ఈ భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను ఛేదించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. ఈ భారీ కొకైన్‌ తరలింపు వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని తిలక్‌నగర్‌ ప్రాంతంలో 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు ఆఫ్గాన్‌ పౌరులను అరెస్టు చేసిన తర్వాత, ఈ భారీ మాదకద్రవ్యాల రాకెట్‌ను ఛేదించడం గమనార్హం.

ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు అతిపెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్‌ను ఛేదించారు. 560 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.2,000 కోట్లు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ బృందం దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీకి చెందిన నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి, 560 కిలోల కంటే ఎక్కువ బరువున్న సరుకును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తులు ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో కొకైన్‌ను విక్రయించాలని ప్లాన్‌ చేసినట్టు అధికారులు తెలిపారు.

ఢిల్లీలో రహస్యంగా డ్రగ్స్ వ్యాపారం సాగుతోంది. పోలీసుల కళ్ళుగప్పి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ యువతలో వ్యసనానికి బీజం వేస్తారు స్మగ్లర్లు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ డీలర్లపై నిత్యం ఓ కన్నేసి ఉంచారు ఢిల్లీ పోలీసులు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాక్షన్ మోడ్‌లో పనిచేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌తో కూడిన స్మగ్లర్లను ఆట కట్టించారు ఢిల్లీ పోలీసులు. ఈ అంతర్జాతీయ డ్రాగ్ రాకెట్ గురించి స్పెషల్ సెల్ దగ్గర గట్టి సమాచారం ఉంది. ఈ ముఠాను పట్టుకునేందుకు స్పెషల్ సెల్ గట్టి ఉచ్చు వేసింది. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారంతో , పోలీసులు ఈ ముఠాపై దాడి చేశారు. దీంతో ఢిల్లీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడింది. రూ.2000 కోట్ల విలువైన 560 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీలో యాక్టివ్‌గా ఉన్న ఓ అనుమానిత డ్రగ్స్ కార్టెల్ ఇంటెలిజెన్స్ మెసేజ్‌లను రికార్డ్ చేయగా, ఈ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ గురించి గాలించామని పోలీసులు తెలిపారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున కొకైన్‌ను తెస్తున్నారని, ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు కొకైన్‌ను డెలివరీ చేయాల్సి ఉందని పోలీసులకు తెలిసింది. ఈ ముఠా గుట్టు రట్టు అయిన వెంటనే స్పెషల్ సెల్ వల వేసి ఈ ముఠా సభ్యులను కొకైన్‌తో పట్టుకుంది. కొకైన్‌ను పెద్ద పెద్ద బస్తాల్లో నింపారు. దీన్ని ట్రక్కులో ఢిల్లీకి తీసుకువస్తున్నారు. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసులో కింగ్‌పిన్‌ను కూడా అరెస్టు చేశారు. అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌తో కింగ్‌పిన్‌కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

పట్టుబడిన 500 కిలోల కొకైన్‌తో దాదాపు 50 లక్షల డోసులు తయారు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ తదితర ప్రాంతాలకు డెలివరీ చేయాల్సి ఉంది. ఇంత పెద్దఎత్తున డ్రగ్స్‌ పట్టుబడడం ఈ సిండికేట్‌కు గట్టి దెబ్బేనని అదనపు పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌సింగ్‌ కుష్వాహ అన్నారు. ఇది నిరంతర కృషికి, నిఘా వ్యవస్థకు దక్కిన పెద్ద విజయమన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..