AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో నీటి కటకట.. దాహంతో నగర ప్రజలు నరకయాతన..

పేరుకే రాజనగరం.. కళ్లెదుటే ఆకాశాన్నంటే భవనాలు.. రాజసౌధాలు.. దేశాన్నేలే అధినేతలు.. ఎటుచూసినా అద్భుతః. కానీ.. గొంతు తడుపుకోడానికి ఒక్క చుక్క మంచినీళ్లుండవు. అవును మీరు చదువుతోంది నిజమే. హస్తినాపురిని వణికిస్తున్న మంచినీళ్ల కరువు. కొనుక్కుని తాగ్గలిగే పెద్దోళ్ల సంగతి అటుంచితే.. నీటి కోసం పూటకో యుద్ధం చేయాల్సిన దురవస్థ పేదోడిది. సహజంగానే.. తాగునీటి సమస్య చుట్టూ చేరి.. రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నాయి ప్రభుత్వాలు, పార్టీలు. వేసవి కాలం ముగిసినా, ఉత్తరాదిలో నీటి కరవు రాజ్యమేలుతోంది.

ఢిల్లీలో నీటి కటకట.. దాహంతో నగర ప్రజలు నరకయాతన..
Water Shortage
Srikar T
|

Updated on: Jun 17, 2024 | 6:25 PM

Share

పేరుకే రాజనగరం.. కళ్లెదుటే ఆకాశాన్నంటే భవనాలు.. రాజసౌధాలు.. దేశాన్నేలే అధినేతలు.. ఎటుచూసినా అద్భుతః. కానీ.. గొంతు తడుపుకోడానికి ఒక్క చుక్క మంచినీళ్లుండవు. అవును మీరు చదువుతోంది నిజమే. హస్తినాపురిని వణికిస్తున్న మంచినీళ్ల కరువు. కొనుక్కుని తాగ్గలిగే పెద్దోళ్ల సంగతి అటుంచితే.. నీటి కోసం పూటకో యుద్ధం చేయాల్సిన దురవస్థ పేదోడిది. సహజంగానే.. తాగునీటి సమస్య చుట్టూ చేరి.. రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నాయి ప్రభుత్వాలు, పార్టీలు. వేసవి కాలం ముగిసినా, ఉత్తరాదిలో నీటి కరవు రాజ్యమేలుతోంది. దేశ రాజధాని సహా.. అనేక నగరాల్లో ఎటుచూసినా తాగునీటి కోసం కటకట స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నరకయాతనే. గుక్కెడు నీటి కోసం.. వీళ్ల వేదన వర్ణనాతీతం.

ఢిల్లీలో ఐతే.. రెండు నెలలుగా వేధిస్తోంది నీళ్ల కొరత. వాటర్ ట్యాంకుల్లో సరఫరా చేస్తున్నా.. అవి సరిపోక.. బిందెడు నీటికోసం ట్యాంకర్ల దగ్గర యుద్ధం చేయాల్సిన పరిస్థితి. బకెట్లు, బిందెలు, వాటర్ క్యాన్లతో.. ట్యాంకర్ల కోసం గంటల తరబడి వెయిటింగ్. ఒకవైపు నీటి సంక్షోభంతో జనం అల్లాడుతుంటే.. మరోవైపు ఈ సమస్య రాజకీయ రంగు పులుముకుంది. మొన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు బీజేపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ.. నిందారోపణలతో టైమ్‌పాస్ చేస్తున్నారు. మట్కా ఫోడ్‌ పేరుతో నిరసన చేపట్టి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు. ఈ ఆందోళనలో దివంగత నేత సుష్మా స్వరాజ్ కూతురు, ఎంపీ బన్సూరి స్వరాజ్ కూడా పాల్గొన్నారు. మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీలో వాటర్‌వార్‌ షురూ అయింది. నీటి పైపులైన్ల నాణ్యత, నిర్వహణ లోపం లాంటి మౌలిక విషయాల మీద ఫోకస్ పెట్టకుండా ఢిల్లీ జనానికి నరకం చూపిస్తోంది అధికార యంత్రాంగం. జనం వెతల్ని వదిలేసి.. పరస్పర ఆరోపణలతో బాహాబాహీకి దిగాయి హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..