Delhi Mysterious Tunnel: దేశ రాజధాని ఢిల్లీలో భారీ సొరంగం బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు మార్గాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్వాతంత్ర్య ఉద్యమకారులను అణచివేసేందుకు బ్రిటీషర్లు ఈ సొరంగ మార్గం వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ శాసన సభ నుంచి ఎర్రకోట వద్దకు ఆ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించారు. దేశాన్ని బ్రిటీషర్లు పాలించిన సమయంలో ఆ మార్గం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులను తరలించేటప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రిటిషర్లు దీనిని ఉపయోగించారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు.
1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు తాను దీని గురించి వినేవాడినని, రెడ్ ఫోర్ట్‌కు అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఉన్నట్లు చెప్పేవారని, దాని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానని, కానీ క్లారిటీ రాలేదని రామ్ నివాస్ అన్నారు. అయితే, ఇప్పుడు ఆ టన్నెల్‌కు చెందిన ముఖ ప్రదేశాన్ని గుర్తించామన్నారు. కానీ, ఆ టన్నెల్‌ను ఇప్పుడు తవ్వడం లేదని, ఎందుకుంటే ఆ మార్గంలో మెట్రో పిల్లర్లు, సీవేజ్ నిర్మాణాలు ఉంటాయన్నారు.అయితే, సొరంగ మార్గాన్ని పునరుద్ధరించి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 లోపు 76 వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి సొరంగం పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
A tunnel-like structure discovered at the Delhi Legislative Assembly. “It connects to the Red Fort. There is no clarity over its history, but it was used by Britishers to avoid reprisal while moving freedom fighters,” said Delhi Assembly Speaker Ram Niwas Goel (2.09) pic.twitter.com/OESlRYik69
— ANI (@ANI) September 2, 2021
1912లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేశారు బ్రిటిష్ పాలకులు. అంతకముందు ఢిల్లీ అసెంబ్లీని సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీగా వాడేవారు. అయితే, 1926లో అసెంబ్లీ ప్రాంగణాన్ని కోర్టుగా మార్చారు. ఇక, స్వాతంత్య్ర సమరయోధులను కోర్టుకు తెచ్చేందుకు ఈ టన్నెల్ మార్గాన్ని వాడేవారని స్పీకర్ గోయల్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో టన్నెల్ ప్రాంతాన్ని విజిట్ చేసినట్లు చెప్పారు.