ఎయిమ్స్‌ హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య

| Edited By:

Aug 11, 2020 | 5:32 PM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఎయిమ్స్‌ హాస్టల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకి.. 22 ఏళ్లు మెడికల్ విద్యార్ధి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన..

ఎయిమ్స్‌ హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఎయిమ్స్‌ హాస్టల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకి.. 22 ఏళ్లు మెడికల్ విద్యార్ధి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. హాస్టల్ భవనం పక్కనే తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని గమనించిన సహచర విద్యార్ధులు.. వెంటనే ఎయిమ్స్‌లోని ట్రామా సెంటర్‌లో చేర్చి చికిత్స
అందించారు. అయితే చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు విడిచాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే మృతుడు గత కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతుండేవాడని.. ఎయిమ్స్‌లోని సైకియాట్రీ విభాగంలో చికిత్స కూడా చేయించుకునే వాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు కూడా తెలిపారు. అయితే ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో అతడి వద్ద ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

 

Read More :

దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం