Crime News: దేశ రాజధానిలో దారుణం.. చపాతీ ఇవ్వలేదని రిక్షా పుల్లర్ ని హత్య చేసిన యువకుడు

|

Jul 29, 2022 | 12:26 PM

మద్యం మత్తులో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.. అయ్యో పాపం అని చపాతీ ఒకసారి ఇచ్చి.. రెండోసారి లేదన్నందుకు .. ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు ఓ వ్యక్తి.. ఈ దారుణ ఘటన దేశ రాజధాని హస్తిన లో చోటు చేసుకుంది.

Crime News: దేశ రాజధానిలో దారుణం.. చపాతీ ఇవ్వలేదని రిక్షా పుల్లర్ ని హత్య చేసిన యువకుడు
Man Kills Rickshaw Puller
Follow us on

Crime News: క్షణికావేశం.. మద్యం మత్తు మనిషిని ఏ స్టేజ్ కైనా తీసుకుని వెళ్తుంది.. తినడానికి ఒకసారి చపాతీ ఇచ్చి.. రెండోసారి ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.. అవును తినడానికి రెండోసారి చపాతీని ఇవ్వడానికి నిరాకరించినందుకు 40 ఏళ్ల రిక్షా పుల్లర్‌ను 26 ఏళ్ల యువకుడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో జూలై 26న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం, ఆర్యసమాజ్ రోడ్డులో అపస్మారక స్థితిలో మున్నా (40) అనే వ్యక్తికి రోడ్డు మీద పడి ఉన్నట్లు తమకు కాల్ ఉందని పోలీసులు చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడు కత్తిపోట్లతో ఉన్నట్లు గుర్తించారు.. వెంటనే అతడిని సమీపంలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు..  చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో కరోల్ బాగ్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 302 (Murder) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డిసిపి (సెంట్రల్) శ్వేతా చౌహాన్ తెలిపారు.

విచారణ చేపట్టిన పోలీసులు కరోల్ బాగ్ ప్రాంతంలో గురువారం నిందితుడు ఫిరోజ్అ ఖాన్ (26)ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు మృతుడు రిక్షా పుల్లర్‌ మున్నగా గుర్తించారు. “నిందితులను గుర్తించడానికి తాము  200 మంది వాగాండ్లను ప్రశ్నించామని చెప్పారు. చపాతీ ఇవ్వడానికి నిరాకరించడంతో మృతుడిని కత్తితో పొడిచినట్లు నిందితుడు ఫిరోజ్అ ఖాన్అంగీకరించాడు” అని పోలీసులు తెలిపారు.

మున్నాతో పాటు తాను కూర్చొని  తాము హోటల్ నుంచి తెచ్చిన భోజనం తినడం ప్రారంహించమని.. ఇంతలో మద్యం మత్తులో ఉన్న ఫిరోజ్ ఖాన్ (26) తమ వద్దకు వచ్చాడని  ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. తమ దగ్గరకు వచ్చిన ఫిరోజ్ తినడానికి ఆహారం అడిగాడని.. అప్పుడు మున్నా అతనికి చపాతీ ఇచ్చాడు. అది తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ కావాలని.. ఫిరోజ్ అడగడంతో.. మున్నా నిరాకరించినట్లు హతుడి స్నేహితుడు చెప్పాడు. ఫిరోజ్ తమను నోటికి వచ్చినట్లు తిట్టి.. అనంతరం.. మున్నాపై దాడి చేసి.. నిందితుడు పదునైన కత్తితో పొడిచినట్లు ప్రత్యక్ష సాక్షి కథనం. పొడిచిన తరువాత, ఖాన్ అక్కడి నుండి పారిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..