
తన పతంజలి సంస్థ ఉత్పత్తి చేసిన కొరొనిల్ మందుపై బాబా రాందేవ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాన్ని ఆపాలని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను పురస్కరించుకుని కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. దేశంలో ఈ కోవిద్ సంక్షోభ సమయంలో రాందేవ్ కొరొనిల్ మందుపై తప్పుడు సమాచారాన్ని కూడా ఇస్తున్నారని ఈ సంస్థ తరఫు లాయర్ రాజీవ్ దత్తా ఆరోపించారు. ఆయన చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు, సైన్స్, డాక్టర్ల ప్రతిష్టను మంట గలిపేవిగా ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆలోపతిపై రాందేవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 14 పేజీలతో కూడిన ఫిర్యాదును ఢిల్లీ ఐపీ ఎస్టేట్ పోలీసు స్టేషన్ లో అందజేసింది. ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి జయేష్ లీలే ఈ సందర్భంగా కొరొనిల్ మెడిసిన్ విషయాన్ని కూడా ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు. కోవిద్ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బాబా రాందేవ్ యత్నిస్తున్నారని, తన కొరొనిల్ ని ప్రమోట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే రాందేవ్ మాత్రం ఆలోపతీని తాను విమర్శించలేదని, దేశంలో వేళ్లూనుకున్న డ్రగ్ మాఫియా గురించే వ్యాఖ్యానించానని అంటున్నారు. తన వ్యాఖ్యలకు గతంలోనే అపాలజీ చెప్పానన్నారు.
అదే సమయంలో తనను అరెస్టు చేసే సాహసం ఎవరికీ లేదని కూడా ఆయన ఓ వీడియో ద్వారా సవాల్ చేశారు. మోదీ ప్రభుత్వానికి ఆ దమ్ము లేదన్నారు. ఉత్తరాఖండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ ఆయనకు షో కాజ్ నోటీసు పంపుతూ 15 రోజుల్లోగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలని లేదా వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Unwanted Hair: ముఖంపై అవాంఛిత రోమాలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే సరి
ముఝే నహీ చాహియే ! వ్యాక్సిన్ భయంతో డ్రమ్ము వెనక నక్కిన అవ్వ ! ఆ తరువాత ఏమైందంటే ….?