Padma Awards: పద్మ అవార్డులకు ఎవరి పేర్లు సిఫార్సు చేయాలన్న విషయంలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో విశిష్ట సేవలందించిన వైద్యులు, హెల్త్‌కేర్ వర్కర్స్ పేర్లను ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్లు కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బందికి అందరూ ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరి పేర్లను పద్మ అవార్డుల కోసం సిఫార్సు చేయాలన్న విషయంలో ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రజలు ఆగస్టు 15నాటికల్లా padmaawards.delhi@gmail.com కు మెయిల్ ద్వారా పేర్లను సిఫార్సు చేయాలని కేజ్రీవాల్ సూచించారు.
ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఆగస్టు 15 తర్వాత స్క్రీనింగ్ కమిటీ ప్రజల నుంచి అందిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని..వారి పేర్లను ఢిల్లీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని వివరించారు. ఆ పేర్లను పద్మ అవార్డుల కోసం సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.
పద్మ అవార్డుల కోసం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న విశిష్ట వ్యక్తుల పేర్లను సిఫార్సు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇది వరకే సూచించడం తెలిసిందే.
Also Read..
వ్యక్తులకు చెడు పరిస్థితులు ఎలా వస్తాయి? ఎటువంటి వారు ఆ పరిస్థితులను తప్పించుకోలేరు?