Viral Video: అసాధారణ రీతిలో రైలు ఎక్కిన మహిళ.. ఇలా కూడా ఎక్కుతారా? అంటూ షాక్ అవుతున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో మీకోసం..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jul 27, 2021 | 2:01 PM

Viral Video: సాధారణంగా బస్సుల్లో గానీ, రైళ్లలో గానీ ప్రయాణించే ప్రయాణికులు వాటికుండే మెట్ల ద్వారా, ప్రవేశ ద్వారాల గుండా..

Viral Video: అసాధారణ రీతిలో రైలు ఎక్కిన మహిళ.. ఇలా కూడా ఎక్కుతారా? అంటూ షాక్ అవుతున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో మీకోసం..
Trains

Viral Video: సాధారణంగా బస్సుల్లో గానీ, రైళ్లలో గానీ ప్రయాణించే ప్రయాణికులు వాటికుండే మెట్ల ద్వారా, ప్రవేశ ద్వారాల గుండా ఆ వాహనాల్లోకి ప్రవేశిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం కాలేజీ విద్యార్థులు, యువకులు బస్సులకుండే కిటికీల ద్వారా బస్సులను ఎక్కడం చూసుంటాం. అయితే అది చాలా అరుదనే చెప్పాలి. కానీ.. ఎవరైనా రైలును కిటికీ ద్వారా ఎక్కడం ఎప్పుడైనా చూశారా? యువకులు కాదు, పురుషులు కాదు.. ఓ మహిళ రైలును కిటికీ ద్వారా ఎక్కడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ఓ మహిళ అసాధారణ రీతిలో రైలును ఎక్కింది. రైలు బోగీకి ఉండే ఎమర్జెన్సీ కిటికీ ద్వారా మహిళ రైలులోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రైలులోని ప్రతి బోగికి సాధారణ కిటికీలతో పాటు.. అత్యవసర విండో కూడా ఉంటుంది. దీనిని అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తారు. అయితే, సీట్లు దక్కించుకోవాలనే తొందరలో ఓ మహిళ.. ఏకంగా రైలు బోగీకి ఉండే అత్యవసర కిటికీలోంచి రైలు ఎక్కేసింది. అయితే, మహిళ అలా ఎక్కుతుండగా.. ఓ వ్యక్తి తన వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 60,000 మందికిపైగా వీక్షించారు. 47 వేల మందికిపైగా లైక్ కొట్టారు. కాగా, మహిళ అసాధారణ ప్రయత్నంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మహిళ చేసిన పనుకు నవ్వుతూ కామెంట్స్ చేయగా.. మరికొందరు ఆమె చేసిన ప్రయత్నం ప్రమాదంతో కూడినదని, అలా చేయకూడదని వార్నింగ్ ఇస్తున్నారు.

Viral Video:

Also read:

Viral News: అజ్ఞాత వ్యక్తి నుంచి షాకింగ్ లెటర్.. చదివిన మహిళ ఫ్యూజులు ఔట్.. అసలేమైందంటే!

ఈ టీవీ ధర వింటే…మూర్ఛపోవడం ఖాయం..సరికొత్త టెక్నాలజీ రూపొందించిన శాంసంగ్‌:Samsung The Wall Video

AP Crime News : కత్తితో ఆవు కాలును నరికిన క్రూరుడు, బావ కంటిపై కత్తివేటు వేసిన బావమరిది

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu