రైతు ఉద్యమం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్ సర్కార్.. ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి తిరస్కరణ

|

Nov 27, 2020 | 2:50 PM

దేశ రాజధాని ఢిల్లీలోని తొమ్మిడి స్టేడియంలను తాత్కాలిక జైల్లుగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని కేజ్రీవాల్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము రైతుల వేంటే ఉంటామని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ‘ఛలో ఢిల్లీ’ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని తరలించేందుకు వీలుగా ఢిల్లీలోని తొమ్మిడి […]

రైతు ఉద్యమం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్ సర్కార్.. ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి తిరస్కరణ
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలోని తొమ్మిడి స్టేడియంలను తాత్కాలిక జైల్లుగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని కేజ్రీవాల్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము రైతుల వేంటే ఉంటామని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ‘ఛలో ఢిల్లీ’ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని తరలించేందుకు వీలుగా ఢిల్లీలోని తొమ్మిడి స్టేడియంలను తాత్కాలిక జైల్లుగా మార్చాలని ఢిల్లీ పోలీసులు భావించారు. ఇందులో భాగంగా ఆ స్టేడియంలను జైల్లుగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సర్కార్‌ను పోలీసులు కోరారు. అయితే ఈ విజ్ఞప్తి ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ తోసిపుచ్చింది. స్టేడియంలను జైళ్లుగా మార్చేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

వ్యవసాయం రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం పలు కీలక చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే రైతుల నాయకులు ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులను అడ్డగిస్తున్నారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారీకేడ్లు ఏర్పాట్లు చేశారు. వాటర్ కేనన్లతో, లాఠీచార్జ్‌లతో రైతులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.