Discount For Electric Cycle: ఎలక్ట్రిక్ సైకిళ్ల కొనుగోలుదారులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ఎంత డిస్కౌంట్ ప్రకటించిందంటే..

|

Apr 09, 2022 | 10:06 PM

Discount For Electric Cycle: దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

Discount For Electric Cycle: ఎలక్ట్రిక్ సైకిళ్ల కొనుగోలుదారులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ఎంత డిస్కౌంట్ ప్రకటించిందంటే..
Electric Cycle
Follow us on

Discount For Electric Cycle: దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం కోసం అనేక రకాల చర్యలు చేపడుతోంది. కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎలక్ట్రిక్ బైక్స్, సైకిల్స్ వినియోగం, తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దేశంలోని ప్రసిద్ధ కార్లు, బైక్స్, సైకిళ్ల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. కార్లు ఉత్పత్తి తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్ భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచిన ఢిల్లీలో.. కాలుష్యాన్ని నియంత్రించేందుకై ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పోత్రహిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ సైకిళ్లు కొనుగోళ్లపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది.

రాష్ట్రంలో ఎవరైతే ఎలక్ట్రిక్ సైకిళ్లు కొనుగోళ్లపై రూ.15,000 వేల తగ్గింపు ప్రకటించారు. ఢిల్లీ నగరంలో ఎలక్ట్రిక్ సైకిళ్లు కొనుగోలు చేసే మొదటి 10,000 మందికి ప్రభుత్వం రూ. 5,500 సబ్సిడీని అందించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ వెల్లడించారు. అలాగే, ఎలక్ట్రిక్ సైకిళ్లను కొనుగోలు చేసే మొదటి 1000 మందికి ప్రభుత్వం అదనంగా రూ.2,000 తగ్గింపు ప్రకటించింది.

అలాగే కార్గో ఈ-సైకిళ్లకు కూడా భారీ సబ్సిడీ ఇస్తున్నట్లు మంత్రి గెహ్లాట్ ప్రకటించారు. మొదటి 5,000 కార్గో ఈ సైకిల్ కొనుగోలుదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పు సబ్సిడీని ప్రకటించింది. అయితే, ఢిల్లీ పౌరులకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుందిన మంత్రి గెహ్లాట్ స్పష్టం చేశారు. ఢిల్లీలో రోడ్లపై ప్రస్తుతం 45,900 ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తున్నాయని, అందులో 36 శాతం ద్విచక్ర వాహనాలేనని మంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీలో నమోదైన మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు 12 శాతం ఉన్నాయని ఆయన తెలిపారు.

Also read:

Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ దిశలో డబ్బులు అస్సలు పెట్టొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!

Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!