Govt Employees: ఢిల్లీ సర్కార్‌ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌!

Govt Employees: ఎప్పటి నుంచో ఢిల్లీ కాలుష్యం కొరల్లో చిక్కుకుని ఇబ్బందులకు గురవుతోంది. కాలుష్యం కారణంగా సరి బేసి సంఖ్య విధానం ప్రవేశపెట్టినా పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి..

Govt Employees: ఢిల్లీ సర్కార్‌ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌!

Edited By:

Updated on: Apr 09, 2022 | 6:44 AM

Govt Employees: ఎప్పటి నుంచో ఢిల్లీ కాలుష్యం కొరల్లో చిక్కుకుని ఇబ్బందులకు గురవుతోంది. కాలుష్యం కారణంగా సరి బేసి సంఖ్య విధానం ప్రవేశపెట్టినా పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రాలేదు. ఇక కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం ప్రోత్సహించేందుకు ఇప్పటికే అనేక స్కీమ్‌లను ప్రవేశపెట్టింది ఢిల్లీ సర్కార్‌. అయినా తగిన స్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాలు పెరగలేదు. దీంతో మరోసారి ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది.

10 వేల మంది ఉద్యోగులకు రూ.5వేల ఇన్సెంటీవ్‌:

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఈఎంఐ పద్దతిలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను అందించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్‌ తొలి దశలో టూ వీలర్స్‌ అందించనుంది. అంతేకాకుండా ముందుగా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసిన పది వేల మంది ఉద్యోగులకు రూ.5వేల చొప్పున ఇన్సెంటీవ్‌గా అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు మొదటి వెయ్యి ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు అదనంగా మరో రూ.2వేల ప్రోత్సాహక నగదును అందిస్తామని కేజ్రీవాల్‌ సర్కార్‌ ప్రకటించింది. ఏదీ ఏమైనా కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఢిల్లీలో కాలుష్యం కారణంగా ఎంతో నష్టం వాటిల్లుతున్న విషయం తెలిసిందే. చాలా మంది కాలుష్యం కారణంగా ఆస్పత్రుల పాలైయ్యారు. దీంతో ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుందనే చెప్పాలి. కాలుష్యం కారణంగా ఢిల్లీలో స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీ కాలుష్యానికి కారణమని గతంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. నవంబర్-డిసెంబర్ మధ్య కాలుష్యం భారీ స్థాయిలో ఎక్కువగా నమోదవుతోందని నాసా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ఇవి కూడా చదవండి:

TRAI USSD Charges: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆ ఛార్జీలను ఎత్తివేసిన ట్రాయ్‌..!

Covid New Variant: మహారాష్ట్రలో కొత్త వేరియంట్‌తో అప్రమత్తమైన తమిళనాడు