Rekha Gupta: విద్యార్థి నాయకురాలి నుంచి ఢిల్లీ సీఎం వరకు.. రేఖా గుప్తా చరిత్ర మామూలుగా లేదుగా..

|

Feb 20, 2025 | 7:29 AM

ఢిల్లీ పీఠంపై ఔర్‌ ఏక్‌ రాణీ. ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా , ఢిల్లీ రాష్ట్ర నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు సీఎంగా రేఖా గుప్తా సహా ఆరుగురు మంత్రులతో ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణస్వీకారోత్సవ వేడుకకు రామ్‌లీలా మైదానంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ ముఖ్య నాయకులు, ఈ వేడుకకు హాజరవుతున్నారు.

Rekha Gupta: విద్యార్థి నాయకురాలి నుంచి ఢిల్లీ సీఎం వరకు.. రేఖా గుప్తా చరిత్ర మామూలుగా లేదుగా..
Rekha Gupta
Follow us on

సీఎంగా రేఖా గుప్తా సహా ఆరుగురు మంత్రులతో ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళయింది.. ముహుర్తం ఈ మధ్యాహ్నాం 12 గంటల 35 నిమిషాలకు. ప్రమాణస్వీకారోత్సవ వేడుకకు రామ్‌లీలా మైదానంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ ముఖ్య నాయకులు, ఈ వేడుకకు హాజరవుతున్నారు. పార్టీ నేతలతో కలిసి మర్యాదపూర్వకంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనాను భేటీ అయ్యారు రేఖా గుప్తా.. అలాగే తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ఢిల్లీ వాసులకు ఆత్మీయంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణస్వీకార వేడుకకు రావాలని ఆహ్వానించారు..

సుష్మా స్వరాజ్‌, షీలా దీక్షిత్‌, కేజ్రీవాల్‌, అతీశి.. ఇప్పుడు ఢిల్లీ నాల్గో మహిళా సీఎంగా రేఖా గుప్తా సరికొత్త చరిత్ర.. ఆప్‌ ఆశలను ఊడ్చి పాడేసి ఢిల్లీలో గ్రేట్‌ విక్టరీ సాధించిన బీజేపీ ..రేఖా గుప్తాను సీఎం ఎంపిక చేయడం ద్వారా తన మార్క్‌ చాటుకుంది. వివాద రహితురాలు.. పార్టీపట్ల విధేయత.. ప్రజాదరణ ఈ మూడు అంశాలు ప్రాధానంగా రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేశారు. మరో కోణం కూడా వుంది. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది. ఆప్‌ ఆశలకు గండి పడింది కూడా అక్కడే. సో.. మహిళా ఓటు బ్యాంక్‌ను పదిలంచేసుకునే స్ట్రాటెజీలో భాగంగానే రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేశారనేది రాజకీయల విశ్లేషకుల మాట.

అయితే.. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్‌ వర్మ, సీనియర్లు విజేందర్‌ గుప్తా వంటి సీనియర్లున్నా.. రేఖా గుప్తాను సెలక్ట్‌ చేయడం వెనుక మరో కారణం.. మచ్చలేని రేఖా గుప్తా రాజకీయ ప్రస్థానం. స్టూడెంట్‌ యూనియన్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిన రేఖా గుప్తా ఈసారి ఎమ్మెల్యేగా ఫస్ట్‌ టైమ్‌ విజయం సాధించారు. గతంలో ఆమె మూడు సార్లు కౌన్సెలర్‌గా గెలిచారు. సౌత్‌ ఢిల్లీ కార్పొరేషన్‌ మేయర్‌గా పనిచేశారు. పనితీరే తన గుర్తింపు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు.

ఇక దౌలత్ రామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన రేఖా గుప్తా.. విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీచేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే ప్రతిష్టాత్మకరమైన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్ సెక్రటరీగా, ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు రేఖా గుప్తా. మూడు దశాబ్దాల కాలంలో బీజేపీలో కీలక పదవులు నిర్వహించారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ఎంపిక చేయగానే ..హస్తిన కమలదళంలో ఉత్సాహం ఉరకలేసింది. గల్లీ గల్లీలో సంబరాలు జోరందుకున్నాయి. ఢిల్లీ కీ రాణీగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి వేళాయింది..ఇప్పుడు అన్ని దారులు రామ్‌లీలా వైపే..అందరి చూపు అటువైపే అన్నట్లు మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..