AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేడీ కానిస్టేబుళ్లే టార్గెట్.. ఏకంగా 20 మందితో డేటింగ్..! కేటుగాళ్లలో వీడిని మించినోడు లేడు..

ఢిల్లీలో ఇన్‌స్టాగ్రామ్‌లో విలాసవంతమైన జీవితం ఉన్నట్లు చూపిస్తూ మహిళా పోలీసు కానిస్టేబుళ్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలువురి నుంచి సుమారు రూ.24 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరు బాధితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లేడీ కానిస్టేబుళ్లే టార్గెట్.. ఏకంగా 20 మందితో డేటింగ్..! కేటుగాళ్లలో వీడిని మించినోడు లేడు..
Delhi Man Arrested
Shaik Madar Saheb
|

Updated on: Oct 24, 2026 | 12:19 PM

Share

న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా ‘లేడీస్ వర్సెస్ రికీ బల్’ చిత్రంలోని మోసగాడి పాత్రను తలపించేలా.. ఇన్‌స్టాగ్రామ్‌లో కోటీశ్వరుడిగా బిల్డప్ ఇస్తూ నమ్మించి, మహిళా పోలీసు కానిస్టేబుళ్ల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రణ్‌వీర్ సింగ్ సినిమాను తలపించే ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని బురారి ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల విక్రాంత్ తోమర్ అనే యువకుడు సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విలాసవంతమైన కార్లు, రిచ్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ తను ఒక పెద్ద బిజినెస్‌మన్‌నని నమ్మబలికాడు. ఇలా ఎంతో మంది అమాయక యువతులను వలలో వేసుకున్నాడు. ముఖ్యంగా ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లను తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి నుంచి విడతల వారీగా రూ. 24 లక్షల వరకు కాజేశాడు.

అసలు గుట్టు రట్టు కావడం వెనుక..

నిందితుడు విక్రాంత్ తోమర్ సహజీవనం (Live-in partner) చేస్తున్న మహిళ కూడా ఢిల్లీ పోలీసు శాఖలోనే కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె ద్వారానే తన బ్యాచ్‌కి చెందిన తోటి మహిళా కానిస్టేబుళ్ల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒకే బ్యాచ్‌కు చెందిన దాదాపు 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ఇతను టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారు.

అద్దె కార్లు, బెట్టింగ్ యాప్స్ వాడుతూ విలాసాలు:

నిందితుడు తన మోసాలకు పక్కా ప్లాన్ వేసుకున్నాడు. తాను నిజమైన కోటీశ్వరుడినని నమ్మించడానికి ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని (గంటల వ్యవధిలో), వాటిలోనే మహిళా కానిస్టేబుళ్లతో తిరిగేవాడు. అంతేకాకుండా, ఒక మహిళా కానిస్టేబుల్ వద్ద నమ్మకం పేరుతో వసూలు చేసిన డబ్బును మరో మహిళను డేటింగ్‌కు తీసుకెళ్లే ఖర్చులకోసం వాడేవాడు. ఈ మోసం ద్వారా సంపాదించిన డబ్బును ‘వన్‌ఎక్స్’ (OneX) బెట్టింగ్ యాప్ ద్వారా లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

గతంలోనూ పలు కేసులు:

నిందితుడు విక్రాంత్ తోమర్పై మాయాపురి, హరినగర్, ఇందర్‌పురి పోలీస్ స్టేషన్లతో పాటు ఈస్ట్ డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో ఇప్పటికే ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లోనే ఇతను జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం సెంట్రల్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
లేడీ కానిస్టేబుళ్లే టార్గెట్.. కేటుగాళ్లలో వీడిని మించినోడు లేడు.
లేడీ కానిస్టేబుళ్లే టార్గెట్.. కేటుగాళ్లలో వీడిని మించినోడు లేడు.
గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కీలక నిర్ణయం ఇదే!
గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కీలక నిర్ణయం ఇదే!
రాత్రంతా స్పెషల్ సాంగ్ షూట్.. తెల్లారే పెళ్లి..!
రాత్రంతా స్పెషల్ సాంగ్ షూట్.. తెల్లారే పెళ్లి..!
గుడ్డు పెంకులను పడేస్తున్నారా? మొక్కల కోసం ఇలా అద్భుతమైన కాల్షియం
గుడ్డు పెంకులను పడేస్తున్నారా? మొక్కల కోసం ఇలా అద్భుతమైన కాల్షియం
NZ vs IND 2nd T20I: టాస్ గెలిచిన భారత్.. వైభవ్ ఎంట్రీ..!
NZ vs IND 2nd T20I: టాస్ గెలిచిన భారత్.. వైభవ్ ఎంట్రీ..!
బరువైన వస్తువులను ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? వాస్తు శాస్త్రం నియమాలు
బరువైన వస్తువులను ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? వాస్తు శాస్త్రం నియమాలు
రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..? కిలో ఎంత?
రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..? కిలో ఎంత?
ఆకాశంలో నాట్యమాడిన 3,473 డ్రోన్‌ల నెమలి!
ఆకాశంలో నాట్యమాడిన 3,473 డ్రోన్‌ల నెమలి!
మోడ్రన్ లుక్.. సంప్రదాయ కళావైభవం.. పి.వి. సింధు ఇంటి స్పెషాలిటీస్
మోడ్రన్ లుక్.. సంప్రదాయ కళావైభవం.. పి.వి. సింధు ఇంటి స్పెషాలిటీస్
టీమిండియా ప్లేయింగ్ 11లోకి బ్రేకుల్లేని బుల్డోజర్ ఎంట్రీ..?
టీమిండియా ప్లేయింగ్ 11లోకి బ్రేకుల్లేని బుల్డోజర్ ఎంట్రీ..?