Delhi Cop shoots: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. సహ ఉద్యోగులపై ఒక పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు పోలీసులు మరణించారు. ఈ ఘటన ఢిల్లీలోని హైదర్‌పూర్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హైదర్‌పూర్ ప్రాంతంలోని వాటర్ ప్లాంట్‌లో సిక్కిం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మధ్యాహ్నం వేళ ఏదో విషయంపై వారి మద్య గొడవ జరిగింది. దీంతో సిక్కిం పోలీస్ తన దగ్గరున్న తుపాకీతో సహచరులపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించారు. మరొక పోలీస్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
కాగా.. నిందితుడు ప్రబిన్ రాయ్ (32)ని పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్‌బిఎన్)లో భాగంగా ప్లాంట్‌లో భద్రత కోసం సిబ్బందిని మోహరించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల గురించి మధ్యాహ్నం 3 గంటలకు కెఎన్‌కె మార్గ్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ వచ్చిందని సీనియర్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
A Sikkim Police personnel posted at a water plant in the Haiderpur area of Delhi shot 3 personnel, after which 2 were killed & one was injured: Delhi Police
— ANI (@ANI) July 18, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..