Medical Emergency : ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం దారిమళ్లింపు.. మెడికల్‌ ఎమర్జెన్సీతో భోపాల్‌కు..

ప్రయాణికుడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే దీనివల్ల ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో వెళ్లడించింది.

Medical Emergency : ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం దారిమళ్లింపు.. మెడికల్‌ ఎమర్జెన్సీతో భోపాల్‌కు..
Indigo

Updated on: Feb 25, 2023 | 9:25 AM

ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానం కొచ్చిన్ నుండి బయలుదేరింది. కానీ, విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా భోపాల్‌కు మళ్లించారు. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ శుక్రవారం (ఫిబ్రవరి 24) ఒక ప్రకటనలో తెలిపింది. కేరళలోని కొచ్చిన్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం భోపాల్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన 6ఈ2407 విమానం కొచ్చిన్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్నది. అయితే విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడి ఆరోగ్యం విషమించడంతో విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అత్యవసర పరిస్థితిలో విమానాన్ని భోపాల్‌కు దారిమళ్లించారు.

అప్పటికే ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న సిబ్బంది.. ప్రయాణికుడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే దీనివల్ల ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో వెళ్లడించింది. మెడికల్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో విమానాన్ని భోపాల్‌కు దారిమళ్లించినట్లు తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..