అక్టోబర్ చివరి వారం నుంచి ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయింది. కాలుష్యం భారీగా పెరిగిపోతోంది. దీని ప్రభావం NCR – నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో కనిపిస్తుంది. ఢిల్లీ, నోయిడాలోని పలు ప్రాంతాల్లో AQI 400 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి సెలవుల తర్వాత తెరిచిన పాఠశాలలు మళ్లీ మూతపడే అవకాశం ఉంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతున్నారు.
అక్టోబరు-నవంబర్‌లో ఢిల్లీ వాసులకు ఇది పెద్ద సవాలు అనే చెప్పాలి. ఈ రెండు నెలల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. చాలా ప్రాంతాలలో AQI 300 కంటే ఎక్కువగా ఉంది. చాలా చోట్ల ఈ సంఖ్య 400 కూడా దాటింది. పిల్లలు లేదా పెద్దలు, ప్రతి ఒక్కరి ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. స్కూళ్లను కూడా మూసేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: IRCTC: కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని చాలా పాఠశాలలకు అక్టోబర్ 30 నుండి దీపావళి సెలవులు ప్రకటించారు. దీని తర్వాత, పాఠశాలలు నవంబర్ 4న ఓపెన్ అయ్యాయి. నవంబర్ 7న ఛత్ పూజ 2024 సందర్భంగా చాలా పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఛత్ పూజ ప్రత్యేక సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఢిల్లీలోని పరిస్థితిని ఏక్యూఐని కొద్దిరోజుల పాటు పర్యవేక్షిస్తారని, దీని తర్వాత కనీసం వారం రోజుల పాటు పాఠశాలలను మూసి ఉంచేలా నిర్ణయం తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Gold: ఈ భవనంలో వేల టన్నుల బంగారం.. 24 గంటలు కమాండోల మోహరింపు.. నిఘా నీడలో ఫోర్ట్ నాక్స్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి