Republic Day Violence: పంజాబీ నటుడు, సింగర్ దీప్ సిద్దూను స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున అల్లర్లకు కారణమైన దీప్ సిద్దూ కోసం జనవరి 26వ తేదీ నుంచి పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన దీప్ సిద్దూను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. వారు ఎర్రకోటపై సిక్కు జెండాను ఎగురవేసేలా దీప్ సిద్దూ ప్రేరేపించాడని.. అంతేకాకుండా ఉద్యమం పక్కదోవ పట్టించేందుకు వ్యూహం రచించడానికి పోలీసుల విచారణలో తేలింది.
Also Read: AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ‘తొలి’ పోరు.. కొనసాగుతున్న పోలింగ్..