Vulture Population: దేశంలో 5 లక్షల మంది మృతికి, 70 బిలియన్ డాలర్ల ఆరోగ్య సంక్షోభానికి కారణమైన రాబందులు.. ఎలా?

ప్రకృతిలో వదిలేసిన జంతు కళేబరాలను రాబందులు తిని.. బ్యాక్టీరియా, వైరస్‌ల వ్యాప్తిని నిరోధిస్తాయి. మరి అలాంటి రాబందులు వేగంగా ఎలా కనుమరుగు అయ్యాయి? వీటి అంతర్థానం.. 5 లక్షల మంది మృతికి ఎలా దారితీసింది? అసలేం జరిగింది?

Vulture Population: దేశంలో 5 లక్షల మంది మృతికి, 70 బిలియన్ డాలర్ల ఆరోగ్య సంక్షోభానికి కారణమైన రాబందులు.. ఎలా?
Vulture Population Feature Image

Edited By: Ravi Panangapalli

Updated on: Aug 07, 2024 | 10:32 AM

మన దేశంలో ఆ మధ్య ఐదు లక్షల మంది మృతి చెందారు. దీనికి ఒకే ఒక్క కారణమేంటో తెలుసా? రాబందులు. అవును. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది పచ్చి నిజం. అంటే దీనర్థం.. ఇవేమీ వాళ్లను డైరెక్ట్ గా చంపలేదు. కానీ వాటి సంఖ్య తగ్గిపోవడానికి పరోక్షంగా కారణమైన మనిషి అతి తెలివే.. భస్మాసుర హస్తంలా వారిని బలిగొంది. ఈ మాటలను ఇంకొంచెం విపులంగా పరిశీలిస్తే.. అసలు కథ అర్థమవుతుంది. 1990ల ప్రాంతంలో రాబందుల సంఖ్య ఘోరంగా పడిపోయింది. ఇది మన దేశంలో డేంజర్ బెల్స్ మోగించింది. రాబందులు చనిపోతే.. దానికి ఎందుకంత గగ్గోలు అనుకోవచ్చు. కానీ దాని రిజల్ట్ 2000-2005 సంవత్సరాల మధ్య కనిపించింది. ఆ ఐదేళ్లలో ఐదు లక్షల చనిపోయారు. అప్పటికి కాని వీటి వల్ల ఉపయోగం ఏమిటో అందరికీ పూర్తిస్థాయిలో అర్థం కాలేదు. కానీ అలా అర్థం చేసుకునేసరికీ పరిస్థితి చేయి దాటిపోయింది. అయినా ఆ తరువాత తీసుకున్న కొన్ని చర్యలు కొంతమేర ఫలితాలనిచ్చాయి. Vulture Population 1 రాబందులు తగ్గిపోతే ఏమవుతుంది అని ముందు తెలుసుకుంటే.. అప్పుడు ఈ ఐదు లక్షల మంది మృతికి అసలు కారణం అర్థమవుతుంది. ఏదైనా జంతువు చనిపోతే దాని కళేబరాన్ని తినేవి రాబందులే. ఒకవేళ ఇవి తినకపోతే.. ఆ జంతువుల డెడ్ బాడీ నుంచి వైరస్ లతో పాటు బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది. దీనివల్ల కలరాతోపాటు ఆంత్రాక్స్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి