New Born Baby: పుట్టిన శిశువు మరణించిందని ప్రకటించిన వైద్య సిబ్బంది.. గంట తర్వాత చిన్నారిలో కదలికలు

|

May 24, 2022 | 11:37 AM

అద్భుతం ఏమిటంటే.. చనిపోయిందనుకున్న శిశువులో కదలికలు కనిపించాయి. సజీవంగా తమ చిన్నారిని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆనందంతో బిడ్డను తీసుకొని ఆస్పత్రికి పరుగెత్తారు. ఈ విచిత్ర సంఘటన జమ్ముకాశ్మీర్‌లో జరిగింది.

New Born Baby: పుట్టిన శిశువు మరణించిందని ప్రకటించిన వైద్య సిబ్బంది.. గంట తర్వాత చిన్నారిలో కదలికలు
Baby Dies
Follow us on

New Born Baby: అప్పుడే పుట్టిన శిశువు మరణించింది అని ఆసుపత్రి సిబ్బంది ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంతో ఆ శిశువుని స్మశానంలో ఖననం చేశారు. అయితే చిన్నారిని ఖననం చేసిన విధానంపై కుటుంబ పెద్దలతో పాటు, గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో శిశువుని ఖననం చేసిన  దాదాపు గంట తర్వాత ఆమె సమాధిని తవ్వవలసిందిగా ఆమె కుటుంబీకులు బలవంతం చేశారు. దీంతో సమాధిని తవ్వాల్సి వచ్చింది. అద్భుతం ఏమిటంటే.. చనిపోయిందనుకున్న శిశువులో కదలికలు కనిపించాయి.  సజీవంగా తమ చిన్నారిని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆనందంతో బిడ్డను తీసుకొని ఆస్పత్రికి పరుగెత్తారు. ఈ విచిత్ర సంఘటన జమ్ముకాశ్మీర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…

జమ్ముకాశ్మీర్‌ బంకూట్‌ కు చెందిన బషరత్‌ అహ్మద్‌ భార్య, రంబాన్‌ జిల్లా బనిహల్‌ ఉప జిల్లా ఆస్పత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆస్పత్రి సిబ్బంది పుట్టిన బిడ్డ ప్రాణంతో లేదని చెప్పారు. దాంతో పుట్టెడు దుఃఖంతో ఆ తల్లిదండ్రులు మృత శిశువును ఖననం చేసేందుకు స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ అంతిమ సంస్కారాలు చేసిన అనంతరం.. మళ్ళీ శిశువుని ఖననం చేసిన ప్రాంతంలో తవ్వకం జరిపారు. అప్పుడు శిశువులో కదలికలు గమనించారు. వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి సిబ్బంది ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కాగా ఇదంతా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే బాధితులు నేరుగా దవాఖానాకు వెళ్లి ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రి నర్స్, స్వీపింగ్ కార్మికురాలిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..