
కేరళలో సంచలనం రేపిన బాయ్ ఫ్రెండ్ మర్డర్ కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితురాలు గ్రీష్మ.. తన బాయ్‌ఫ్రెండ్ షారోన్ రాజ్‌కు కూల్ డ్రింక్‌లో విషయం కలిపి ఉచ్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. ప్రధాన నిందితురాలు గ్రీష్మాకు మరణశిక్ష విధిస్తూ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఏఎం బషీరిన్ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మూడో నిందితుడు, గ్రీష్మ మామ నిర్మలా కుమారన్ నాయర్‌కు కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. తుది వాదనలు విన్న కోర్టు వారిద్దరినీ దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న గ్రీష్మ తల్లిని సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు వదిలేసింది. ఈ మేరకు కోర్టు శిక్షను ఖరారు చేసింది.
ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేసినందుకు కేరళ పోలీసులను కోర్టు ప్రశంశించింది. కోర్టు 586 పేజీల తీర్పును ఈ సందర్భంగా వెలువరించింది. తనను ప్రేమించిన వ్యక్తిని నిందితురాలు మోసం చేసిందని, అది సమాజానికి మంచి సందేశం ఇవ్వబోదని కోర్టు పేర్కొంది. ఇది అరుదైన కేసని, అందువల్ల ఆమె వయస్సును పరిగణనలోకి తీసుకోలేమని మరణశిక్ష విధించినట్లు తీర్పు సందర్భంగా నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు వెల్లడించింది. తీర్పు విన్న తర్వాత గ్రీష్మా ఎలాంటి రియాక్షన్ లేకుండా కోర్టులో నిలబడి ఉన్నట్లు మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి.
2022వ సంవత్సరం అక్టోబరు 14న షారన్ రాజ్ (23)ని అతడి గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మ తన పుట్టిన రోజు సందర్భంగా.. చీరాలోని తన ఇంటికి పిలిచింది. అక్కడ ఆమె హెర్బిసైడ్ (పారాక్వాట్) అనే హెర్బల్ మెడిసిన్‌లో విషం కలిపి ప్రియుడు షారన్‌తో తాగించింది. అనంతరం తీవ్ర వాంతులు, శారీరక సమస్యలతో ఆసుపత్రిలో చేరిన షారన్ 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి అదే ఏడాది అక్టోబర్ 25న ఆస్పత్రిలో మరణించాడు. సముదాయపేట జేపీ భవన్‌కు చెందిన జయరాజ్ కుమారుడు షారన్ నెయూర్. ఇతడు క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్‌లో బీఎస్సీ రేడియాలజీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆయుర్వేద వైద్యుడైన షరాన్ సోదరుడు షిమోన్ రాజ్ హత్యకు దారితీసిన సాక్ష్యాలను వెలికితీయడంలో కేసు కీలక మలుపు తిరిగింది. హెర్బిసైడ్ పారాక్వాట్‌లో గ్రీష్మా విషాన్ని కలిపినట్లు షిమోన్ వైద్య పరీక్షల్లో గుర్తించాడు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా నేరాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించాయి.
షారన్, గ్రీష్మా సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే గ్రీష్మ, మరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసింది. షారోన్‌తో తన సంబంధానికి ముగింపు పలకాలని భావించి ఈ విషయం తొలుత షారోన్‌ను తెలిపింది. అయితే షారాన్ విడిపోవడానికి నిరాకరించడంతో, హత్యకు పథకం పన్నింది. ఇందులో భాగంగా గ్రీష్మా తొలుత జ్యూస్‌లో పారాసెటమాల్ ఎక్కువగా కలిపి షరాన్‌ను చంపడానికి ప్రయత్నించింది. అయితే అది చేదుగా ఉందని జ్యూస్ తాగకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. అనంతరం విషం కలిపిన హెర్బల్ మెడిసిన్ ఇచ్చి హతమార్చింది. షారోన్ వైద్య రికార్డులు, గ్రీష్మాతో చేసిన చాట్‌ల డిజిటల్ సాక్ష్యం ప్రాసిక్యూషన్ కేసును బలపరిచాయి.
2023 జనవరి 25న అప్పటి పోలీసు సూపరింటెండెంట్ శిల్ప నేతృత్వంలోని ప్రత్యేక బృందం నేతృత్వంలోని నిశిత దర్యాప్తు తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 15న ప్రారంభమైన విచారణ ఈ ఏడాది జనవరి 3తో ముగిసింది. ఈ కేసులో 95 మందికి పైగా సాక్షులను విచారించారు. ఈ కేసులో డిఫెన్స్, ప్రాసిక్యూషన్ తుది వాదనలను కోర్టు శనివారం (జనవరి 17) విన్నది. అయితే తీర్పు రిజర్వులో ఉంచింది. సోమవారం తుది తీర్పు వెలువరించి నిందితురాలికి ఉరి శిక్ష ఖరారు చేసింది. సెక్షన్ 201 ప్రకారం మూడవ నిందితుడైన ఆమె మామ నిర్మలకుమారన్ నాయర్‌ను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. తల్లి సింధు నిర్దోషిగా విడుదలైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.