Karnataka: పెద్దలను ఎదురించి వెళ్లిపోయారు.. కట్ చేస్తే గోనె సంచిలో డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే..

ఇద్దరూ ఓకే ప్రాంతానికి చెందిన వారు. ఫ్రెండ్స్ గా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా మారింది. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని, దూరంగా..

Karnataka: పెద్దలను ఎదురించి వెళ్లిపోయారు.. కట్ చేస్తే గోనె సంచిలో డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే..
Murder Case

Updated on: Oct 16, 2022 | 7:31 AM

ఇద్దరూ ఓకే ప్రాంతానికి చెందిన వారు. ఫ్రెండ్స్ గా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా మారింది. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని, దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ ఎడబాటును వారు భరించలేకపోయారు. ఇంట్లో నుంచి ఇద్దరూ పారిపోయారు. ఇలా జరిగిన కొన్ని రోజులకే యువకుడు మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యం కావడం సంచనంగా మారింది. విజయపుర జిల్లాకు చెందిన భీమన్న డిగ్రీ చదువుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వారిని మందలించారు. ఇంకెప్పుడూ కలుసుకోవద్దని హార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా వారిని కాలేజీ కూడా మార్పించారు. అయితే.. పెద్దల మాటలు పట్టించుకోకుండా యువతీయువకులిద్దరూ సెప్టెంబర్​ 20 న ఇంటి నుంచి పారిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు గ్రామంలో వెతికారు. తెలిసిన వాళ్ల ఇళ్లకు వెళ్లారేమోనని ఆరా తీశారు. అయినా లాభం లేకపోవడంతో టికోటా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో అక్టోబర్​10న కృష్ణా నది ఒడ్డున ఓ గోనె సంచిలో కుళ్లిన స్థితిలో ఉన్న డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడు వేసుకున్న టీ-షర్ట్​ ఆధారంగా అతను భీమన్న అని గుర్తించారు. వెంటనే అతని కుటుంబసభ్యులకు సమాచారం అందిచారు. అయితే.. యువతికి సంబంధించిన వివరాలు ఇంకా లభ్యం కాలేదు. ఆమెను కూడా చంపేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమిస్తున్నాడన్న కారణంతో యువతి తరఫు బంధువులే చంపేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులపై అనుమానంతో ఆమె తండ్రిని, మేనమామని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.