Armed Forces Tribunal: ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ వచ్చేసింది. న్యాయవ్యవస్థలో ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క.!
న్యాయవ్యవస్థలో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. ఒకమాటలో చెప్పాలంటే న్యాయవ్యవస్థలో నవశకం మొదలైందని చెప్పాలి.

Armed Forces Tribunal: న్యాయవ్యవస్థలో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. ఒకమాటలో చెప్పాలంటే న్యాయవ్యవస్థలో నవశకం మొదలైందని చెప్పాలి. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ NV రమణ నియామకంతో పెండింగ్ విషయాలన్నీ చకచకా క్లియర్ అవుతున్నాయి.
లేటెస్ట్ గా ఆరుగురు సభ్యులతో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది కేంద్రం. ఆరుగురు సభ్యుల నియామకానికి ఆమోదం తెలిపింది. వీరంతా నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ట్రిబ్యునల్స్‌లో ఖాళీల భర్తీ జాప్యంపై ఇటీవల సుప్రీంకోర్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో..ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం..ఈ నెల 6న ట్రిబ్యునల్స్‌లో ఖాళీల నియామకంపై విచారణ చేపట్టింది. కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫలితంగా తాజాగా కొత్త జడ్జిల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. జస్టిస్ బాలకృష్ణ నారాయణ, జస్టిస్ శశికాంత్ గుప్తా, జస్టిస్ రాజీవ్ నారాయన్ రైనా, జస్టిస్ కె.హరిలాల్, జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి, జస్టిస్ అంజనా మిశ్రా నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Armed Forces Tribunal



