ఖాకీ ఉగ్రవాది, జమ్మూ డీఎస్పీ దవీందర్‌సింగ్‌ను హీరానగర్ సబ్‌జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్ఐఏ కోర్ట్ జడ్జి. కోట్బాల్ వాల్ జైల్లో తాను అరెస్ట్ చేసిన నిందితులు ఖైదీలుగా ఉన్నారని..వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టుకు విన్నవించుకున్నారు. దవీందర్ అభ్యర్థన మేరకు అతన్ని హీరానగర్ సబ్‌జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
పదిరోజుల పాటు జమ్మూకశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న దవీందర్‌ను 15రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకిచ్చారు. అనంతరం అతన్ని జైలుకు రిమాండ్ చేశారు. దవీందర్ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు సహకారం అందించాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దవీందర్ తొలగించిన వాట్సాప్ ఛాటింగులను సేకరించేందుకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంకు పంపించారు ఎన్ఐఏ అధికారులు.