Health Worker : ఓ చేతిలో మెడిసిన్ బాక్స్, బిడ్డను వీపుకి కట్టుకుని నది దాటి మరీ విధులు నిర్వహిస్తున్న మహిళ హెల్త్‌ అసిస్టెంట్‌

|

Jun 23, 2021 | 10:18 PM

Health Worker : ప్రభుత్వ ఉద్యోగం అన్నా.. ప్రభుత్వ ఉద్యోగులన్నా కొంతమందికి చిన్న చూపు. .. వారు సరిగ్గా విధులు నిర్వహించరంటూ నోటికి వచ్చినట్లు వ్యాఖ్యానిస్తారు.. అన్ని చోట్ల మంచి చెడు ఉన్నట్లు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో..

Health Worker :  ఓ చేతిలో మెడిసిన్ బాక్స్, బిడ్డను వీపుకి కట్టుకుని నది దాటి మరీ విధులు నిర్వహిస్తున్న మహిళ హెల్త్‌ అసిస్టెంట్‌
Healath Worker
Follow us on

Health Worker : ప్రభుత్వ ఉద్యోగం అన్నా.. ప్రభుత్వ ఉద్యోగులన్నా కొంతమందికి చిన్న చూపు. .. వారు సరిగ్గా విధులు నిర్వహించరంటూ నోటికి వచ్చినట్లు వ్యాఖ్యానిస్తారు.. అన్ని చోట్ల మంచి చెడు ఉన్నట్లు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా బాధ్యత గలిగిన వారు.. బాధ్యత నుంచి తప్పించుకుని తిరిగేవారు ఉంటారు. ఇదే విషయం అనేక సార్లు రుజువైంది. కొండకోనల్లో చదువు చెప్పడానికి వెళ్లే ఉపాధ్యాయులు, ఉత్తరాలు డెలివరీ చేసే పోస్ట్ మెన్ .. లతో పాటు హెల్త్ వర్కర్లు వంటి అనేక మంది అంకిత భావంతో సేవ చేస్తారు. తాము ఎన్ని కష్టాలను పడినా సరే ప్రజలకు సేవ చేస్తారు తాజాగా జార్ఖండ్ కు చెందిన ఓ హెల్త్ అసిస్టెంట్ టీకా ఇవ్వడానికి చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

జార్ఖండ్‌కు చెందిన హెల్త్‌ అసిస్టెంట్‌ మంతి కుమారి రోజూ గ్రామాలకు వెళ్లి చిన్నారులకు టీకాలను ఇస్తుంటుంది. అయితే కుమారికి ఒక కుమార్తె ఉంది. చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వాలంటే రోజూ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకని కుమార్తెను ఇంట్లో వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అయితే చిన్న పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లడం ప్రమాదం కనుక తన కుమార్తెను తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో తన కుమార్తెను వీపుకు కట్టుకుని తనతోపాటే తీసుకెళ్తోంది.

ఈ క్రమంలోనే కుమారి తిసియా, గొయిరా, సుగబంధ్‌ గ్రామాలకు రోజూ వ్యాక్సిన్ వేయడానికి వెళ్తోంది. దీంతో తన కుమార్తెను వీపుకు కట్టుకుని దారిలో ఉండే నదులను దాటుతూ తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తోంది. దీంతో అందరూ కుమారి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కుమారి నది దాటుతుండగా తీసిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కుమారి అంకిత భావం పై పని తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: నేచురల్ స్టార్ కోసం విలన్ గా మారుతున్న హైబ్రిడ్ పిల్ల‌.. ప్రత్యేక మ్యానరిజంపై కసరత్తు చేస్తున్న సింగిల్ పీస్