AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi : నేచురల్ స్టార్ కోసం విలన్ గా మారుతున్న హైబ్రిడ్ పిల్ల‌.. ప్రత్యేక మ్యానరిజంపై కసరత్తు చేస్తున్న సింగిల్ పీస్

Sai Pallavi : ఇప్పుడున్న నటీనటుల్లో సహజంగా నటించే వారిలో ఒకరిగా సాయి పల్లవి పేరు తెచ్చుకున్నారు. ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు సాయి పల్లవి...

Sai Pallavi : నేచురల్ స్టార్ కోసం విలన్ గా మారుతున్న హైబ్రిడ్ పిల్ల‌.. ప్రత్యేక మ్యానరిజంపై కసరత్తు చేస్తున్న సింగిల్ పీస్
Sai Pallavi
Surya Kala
|

Updated on: Jun 23, 2021 | 9:52 PM

Share

Sai Pallavi : ఇప్పుడున్న నటీనటుల్లో సహజంగా నటించే వారిలో ఒకరిగా సాయి పల్లవి పేరు తెచ్చుకున్నారు. ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు సాయి పల్లవి.హిట్ ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది.  ఏ పాత్రలో నటిస్తే, ఆ పాత్రలో ఒదిగిపోయే ఈ నటి కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూడనప్పటికీ.. వైవిధ్య సినిమాలు తీసే వారు మాత్రం మొదటి ఆప్షన్‌గా సాయి పల్లవిని  ఎంచుకుంటున్నారు. ఆమె అయితేనే తాము రాసుకున్న పాత్రలకు న్యాయం చేయగలదని నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే యువ దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ సాయి పల్లవిలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారట.

నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌, శ్యామ్ సింగరాయ్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా సాయి పల్లవి ఫైనల్ అయిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఆమెది సాధారణ హీరోయిన్ పాత్ర కాదని, విలన్ అని సమాచారం. ఎంతోమందిని పరిశీలించి సాయి పల్లవిని ఎంపిక చేశారని., పాత్ర బావుండటంతో ఆమె ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇక ఇందుకోసం ప్రస్తుతం ప్రత్యేక మ్యానరిజంపై ఆమె కసరత్తు చేస్తున్నట్ల సమాచారం. ఒకవేళ నిజమైతే సాయి పల్లవిని కొత్త అవతారంలో చూడబోతున్నమాట. అంతేకాదు ఈ పాత్రకు సాయి పల్లవి న్యాయం చేయగలదు అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. కాగా ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్‌లో నటిస్తోన్న నాని.. ఈ మూవీ తరువాత శ్యామ్‌ సింగరాయ్‌లో నటించనున్నారు.

సాయి పల్లవి..హైబ్రిడ్ పిల్ల‌..ఒక్క‌టే పీస్. సినిమాలో మాత్ర‌మే కాదు. బ‌య‌ట కూడా ఆ మాట నిజ‌మేనేమో అనిపిస్తుంది. ఆమెను చూస్తున్న‌ప్పుడ‌ల్లా పక్కింటి పిల్లలానే అనిపిస్తుంది. నేచుర‌ల్ గా ఉంటూ అభిమానుల‌ను బుట్ట‌లో వేసుకుంటుంది. అయితే సాయి ప‌ల్ల‌విని బ‌య‌ట ఎప్పుడైనా చూడండి. చేతికి జ‌ప‌మాల‌​ క‌నిపి‌స్తుంటుంది. సంప్రదాయ, మోడ‌ర‌న్.. ఇలా ఏ దుస్తుల్లో ఉన్నా ఈ మాల‌ మాత్రం త‌ప్ప‌నిస‌రిగా క‌నిపిస్తుంది. అయితే తను ఆ చైన్​ ఎందుకు ధ‌రిస్తుందో ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. అది తన తాత‌య్య ఇచ్చిన జ‌ప మాల అని..దానితో ప్రేయ‌ర్ చేస్తుంటాన‌ని తెలిపింది, ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో ‘విరాట పర్వం’ అనే మూవీలో నటిస్తోంది‌. రానా హీరోగా చేస్తోన్న ఈ మూవీలో వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read:  భారత్ అంటే. భావం రాగం తాళం అని అర్ధం చెప్పిన కంగనా.. బానిస పేరు ఇండియాను బాన్ చేయాలి పిలుపు l

Follow Us