Daughter of IAS Couple: సీనియర్‌ ఐఏఎస్‌ దంపతుల కుమార్తె ఆత్మహత్య.. ఎవరూ బాధ్యులు కారంటూ సూసైడ్‌ నోట్‌

|

Jun 03, 2024 | 6:13 PM

ఐఏఎస్ దంప‌తుల‌ 27 యేళ్ల కూతురు ఆత్మహ‌త్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని ఎత్తైన అపార్ట్‌మెంట్‌ 10వ ఫ్లోర్ నుంచి ఆమె కింద‌కు దూకి సూసైడ్‌ చేసుకుంది. మృతురాలిని మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్ అధికారుల కుమార్తె లిపి (27)గా గుర్తించారు. ఆమె సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు బలవన్మరణానికి పాల్పడింది. లిపి హర్యానాలోని సోనిపట్‌లో ఎల్‌ఎల్‌బీ..

Daughter of IAS Couple: సీనియర్‌ ఐఏఎస్‌ దంపతుల కుమార్తె ఆత్మహత్య.. ఎవరూ బాధ్యులు కారంటూ సూసైడ్‌ నోట్‌
Daughter of IAS Couple Suicide
Follow us on

ముంబై, జూన్‌ 3: ఐఏఎస్ దంప‌తుల‌ 27 యేళ్ల కూతురు ఆత్మహ‌త్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని ఎత్తైన అపార్ట్‌మెంట్‌ 10వ ఫ్లోర్ నుంచి ఆమె కింద‌కు దూకి సూసైడ్‌ చేసుకుంది. మృతురాలిని మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్ అధికారుల కుమార్తె లిపి (27)గా గుర్తించారు. ఆమె సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు బలవన్మరణానికి పాల్పడింది. లిపి హర్యానాలోని సోనిపట్‌లో ఎల్‌ఎల్‌బీ చదువుతుంది. తన అకడమిక్స్ గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంతో ఆమె మ‌హారాష్ట్ర సెక్రటేరియేట్ వ‌ద్ద ఉన్న సురుచి అపార్ట్‌మెంట్‌లో ఈ రోజు తెల్లవారుజామున 4 గంట‌ల‌కు సూసైడ్ చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంఘటన అనంతరం లిపిని వెంటనే జిటి ఆసుపత్రికి తరలించగా అమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.

సంఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. దీనిపై అస‌హ‌జ మ‌ర‌ణం కింద క‌ఫే ప‌రేడ్ పోలీసు స్టేష‌న్‌లో కేసు నమోదైంది. లిపి తండ్రి మ‌హారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ‌లో ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె త‌ల్లి రాధికా ర‌స్తోగీ కూడా మహారష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిగా ప‌నిచేస్తున్నారు.

కాగా గతంలో మహారాష్ట్ర కేడర్ ఐఎఎస్ దంపతులు మిలింద్, మనీషా మహీస్కర్‌లకు చెందిన 18 ఏళ్ల కుమారుడు 2017లో ముంబైలోని ఎత్తైన భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.