India Covid Cases: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. తస్మాత్‌ జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక

|

Mar 19, 2023 | 5:00 AM

గతంలో కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతం చేసింది. కరోనా బారిన పడి ఎంతో మంది ప్రాణాలు విడిచారు. చాలా మంది చికిత్స పొంది కోలుకున్నారు..

India Covid Cases: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. తస్మాత్‌ జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక
Covid 19
Follow us on

గతంలో కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతం చేసింది. కరోనా బారిన పడి ఎంతో మంది ప్రాణాలు విడిచారు. చాలా మంది చికిత్స పొంది కోలుకున్నారు. ఇప్పుడు కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నాలుగు నెలల గ్యాప్‌ తర్వాత కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు నెలల గ్యాప్‌ తర్వాత.. దేశంలో రోజువారీ కోవిడ్‌ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. శనివారం దేశవ్యాప్తంగా 800 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా 841 కేసులు నమోదయ్యాయి. దీంతో.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 5వేల 389కి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు.. కరోనా మరణాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. జార్ఖండ్‌,మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా మరణం నమోదయ్యాయి. కేరళలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని గణాంకాలు పేర్కొన్నాయి.

కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 4.46 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఓవైపు ఫ్లూ విజృంభిస్తోంది. ఇంకోవైపు కరోనా కాటేస్తోంది. దీనికి తోడు దేశవ్యాప్త వర్షాలు కలవరం రేపుతున్నాయి. వర్షాలు తగ్గితే అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉండడంతో కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. కరోనా నిబంధనలు అన్నీ పాటించాలంటోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా ఇమ్యూనిటీ అందరిలో ఉన్నా.. మరోసారి విజృంభించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు నిపుణులు. కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకకు.. పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్, టీకాల పంపిణీ పెంచాలని సూచించింది. కరోనా కేసుల కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొత్త కొత్త వైరస్‌లు వెంటాడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది కేంద్రం. ముందులాగే ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా, గతంలో చాపకింద నీరులా విస్తరించిన కరోనా మహమ్మారితో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తినేందుకు తిండిలేక చాలా మంది పస్తులుండిపోయారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయి తీవ్ర అవస్థలకు వెళ్లదీశారు. ఇప్పుడు మరోసారి ఫ్లూ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి