Cyclone Sitrang: తీర ప్రాంతాల్లో దడపుట్టిస్తున్న సిత్రాంగ్‌ తుఫాన్‌.. ఏపీ సహా పలు రాష్ట్రాలకు అలెర్ట్..

|

Oct 19, 2022 | 1:37 PM

సిత్రాంగ్‌ తుపాను హెచ్చరికలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది.

Cyclone Sitrang: తీర ప్రాంతాల్లో దడపుట్టిస్తున్న సిత్రాంగ్‌ తుఫాన్‌.. ఏపీ సహా పలు రాష్ట్రాలకు అలెర్ట్..
Cyclone Sitrang
Follow us on

సిత్రాంగ్‌ తుపాను హెచ్చరికలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. మరోవైపు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అక్టోబర్ 20నాటికి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అనంతరం ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ అక్టోబర్ 22 ఉదయానికి వాయుగుండంగా మారుతుందని, ఆ తర్వాత మరింతగా బలపడి తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ తుఫాన్‌ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరం దాటుతుందనే ముందస్తు సంకేతాలతో తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అక్టోబరు నెలలో పలు తుపానులు ఇప్పటికే ఇక్కడి ప్రజల గుండెల్లో దడ పుట్టించాయి. ఈ భయంతోనే సిత్రాంగ్‌ తుపాను ఎటువంటి బీభత్సం సృష్టిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. అక్టోబర్ 21, 22 తేదీల్లో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో జాలర్లు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ యంత్రాంగం అప్రమతంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు భయపడి ఆందోళన చెందాల్సిందేమీ లేదంటున్నారు.

ఇదిలాఉండగా అక్టోబర్ 25వ తేదీ నాటికి సిత్రాంగ్‌ తుపాను పశ్చిమ బెంగాల్‌ దిఘా ప్రాంతంలో తీరం దాటుతుందని అమెరికా గ్లోబల్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌ జీఎఫ్‌ఎస్‌ ముందస్తు సమాచారం ప్రసారం చేసింది. యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ సంస్థ సిత్రాంగ్‌ తుపాను బాలాసోర్‌ ప్రాంతంలో తీరం దాటుతుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..