జాగ్రత్త..! ముంచుకొస్తున్న ‘మోచా’ తుపాను ముప్పు.. మే 11 వరకు ఆయా రాష్ట్రాలకు హై అలర్ట్‌..

|

May 05, 2023 | 5:19 PM

మోచా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. మే 08 నుంచి 11వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

జాగ్రత్త..! ముంచుకొస్తున్న ‘మోచా’ తుపాను ముప్పు.. మే 11 వరకు ఆయా రాష్ట్రాలకు హై అలర్ట్‌..
Cyclone Alert
Follow us on

సూర్యుడు మర్చిపోయాడో, లేదంటే వరుణుడితో కలిసి పోయాడో తెలియదు గానీ, దేశవ్యాప్తంగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మునుపెప్పుడూ లేని విధంగా నడివేసవిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కురిసిన ఆకాల వర్షాలు రైతన్నలను నిలువునా ముంచేశాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి కూడా అకాల వర్షాలకు అధ్వాన్నంగా మారింది. రైతులు ఆ బాధ నుండి తెరుకోకముందే.. తుఫాను రూపంలో మరో పిడుగులాంటి వార్త వచ్చిపడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మోచా తుపాను ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 7న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే కొత్త అల్పపీడనం మే 8న బలపడి అల్పపీడనంగా మారనుందని సమాచారం. ఈ అల్పపీడనం మే 9న తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు మోచా అని పేరు పెట్టినట్లు సమాచారం. ఈ తుపాను కారణంగా మత్స్యకారులు 10వ తేదీ వరకు ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.

బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి తూర్పు తీరం వైపునకు దూసుకువస్తోంది. మే 7 – మే 9 తేదీల మధ్య ఈ తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు భారీ నుంచి, అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌: మోచా తుఫాను కారణంగా ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తమిళనాడు: మోచా తుఫాను చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో రాష్ట్రమంతా అప్రమత్తమైంది.

పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్‌లోని తుపాను ప్రభావిత జిల్లాలన్నీ అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (SDRF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) అప్రమత్తంగా ఉన్నాయి. మే 08 నుంచి 11వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. లోతైన సముద్రంలో ఉన్నవారు 7వ తేదీలోగా ఒడ్డుకు చేరుకోవాలని సూచించారు.

ఒడిశా: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యవసర నేపథ్యంలో అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని నవీన్ కోరారు. గత 4 సంవత్సరాలలో, ఒడిశా మే నెలలో 4 తుఫానులను చూసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..