ట్విస్ట్‌‌లతో గోల్డ్‌ స్మగ్లింగ్‌.. కడుపులో బంగారం బయటకు తీసి..!

| Edited By:

Nov 07, 2019 | 12:13 PM

గత కొద్ది రోజుల నుంచి చెన్నైలో భారీగా బంగారం పట్టుబడుతోంది. కోట్లల్లో విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు. అయితే.. ఈ బంగారం స్థానికంగా ఉన్న వ్యాపారులే చేస్తున్నారా..? లేక వెనుక నుంచి ఎవరైన నడిపిస్తున్నారా..? అంటే దానికి కూడా పలు విస్తుపోయే నిజాలు దొరికాయి. ముఖ్యంగా.. తమిళనాడులోని మధురై, తిరుచ్చి ఎయిర్‌పోర్టులకు పసిడి అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. అక్కడికి మాత్రమే ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారనే ప్రశ్న అందరిలోనూ.. మెదులుతోంది. దీనిపై రెక్కీ నిర్వహించిన పోలీసులకు […]

ట్విస్ట్‌‌లతో గోల్డ్‌ స్మగ్లింగ్‌.. కడుపులో బంగారం బయటకు తీసి..!
Follow us on

గత కొద్ది రోజుల నుంచి చెన్నైలో భారీగా బంగారం పట్టుబడుతోంది. కోట్లల్లో విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు. అయితే.. ఈ బంగారం స్థానికంగా ఉన్న వ్యాపారులే చేస్తున్నారా..? లేక వెనుక నుంచి ఎవరైన నడిపిస్తున్నారా..? అంటే దానికి కూడా పలు విస్తుపోయే నిజాలు దొరికాయి.

ముఖ్యంగా.. తమిళనాడులోని మధురై, తిరుచ్చి ఎయిర్‌పోర్టులకు పసిడి అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. అక్కడికి మాత్రమే ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారనే ప్రశ్న అందరిలోనూ.. మెదులుతోంది. దీనిపై రెక్కీ నిర్వహించిన పోలీసులకు పలు ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. బంగారం తరలించడానికి చిన్న ఎయిర్‌పోర్టులను.. టార్గెట్‌ చేశారు స్మగ్మర్లు. పెద్ద విమానాశ్రయాల్లో తనిఖీలు ఎక్కువగా ఉండడం, తరచూ బంగారం పట్టుబడుతుండడంతో చిన్న ఎయిర్ పోర్టుల ద్వారా.. స్మగ్మర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

కాగా.. ఈ రోజు తాజాగా.. మరో మాయ లేడీల గుట్టు రట్టైంది. కడుపులో 3 కిలోల బంగారం అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు మహిళలు. గర్బం దాల్చారేమోనని ముందుగా అధికారులు భావించారు. కానీ అనుమానంతో తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది.

ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని.. ఆస్పత్రికి తరలిస్తుండగా 10 మంది దుండగులు కిడ్నాప్‌ చేశారు. ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి కడుపులో ఉన్న బంగారాన్ని బయటకు తీసి వారిని వదిలిపెట్టారు. ఈ ఘటన చైన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. వీడొక్కడే సినిమా తరహాలోనే ఈ బంగారం స్మగ్లింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఇంత కథ వెనుక ఎవరు ఉన్నారనే విషయం అటు పోలీసులకు, ఇటు జనాలకు ఆసక్తిగా మారింది. అయితే.. ఇంతకు ముందు ఇలాంటి పనులు మలేషియా వాళ్లు చేసేవారు. ఇప్పుడు సింగపూర్ వాళ్లు చేస్తున్నారు.