పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దుతో బాటు ఆయన టీమ్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని అకాలీదళ్ డిమాండ్ చేసింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు, తాలిబన్లకు అనుకూలంగా మాట్లాడినందుకు వారిపై ఈ కేసులు దాఖలు చేయాలని అకాలీదళ్ నేత బిక్రమ్ మజీతియా కోరారు. కాశ్మీర్ ప్రత్యేక దేశమని, ఇండియా దీన్ని అక్రమంగా ఆక్రమించుకుందని సిద్దు సలహాదారుల్లో ఒకరైన మల్వీందర్ సింగ్ మాలి వ్యాఖ్యానించగా.. మరో సలహాదారైన ప్యారేలాల్ గార్గి..తాలిబాన్లకు అనుకూలంగా వారిని ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు. ఈ టీమ్ అంతా పాకిస్థాన్ ఐఎస్ఐ అనుబంధ కార్యాలయంలో పని చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇది పీసిసీ కార్యాలయం కాదని..ఐఎస్ఐ సబ్ కార్యాలయమని ఆయన అభివర్ణించాడు. ఇదంతా చూస్తూ తాము మౌన ప్రేక్షకుల్లా ఉండజాలమన్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15 నాడే తానీ అంశాన్ని ప్రస్తావించానని, పార్టీ కార్యాలయాన్ని వీరు దుర్వినియోగం చేస్తున్నారని మజీతియా ఆరోపించారు. సిద్దుతో బాటు ఆయన టీమ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవలసి ఉందన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తామీ విషయాన్ని తీసుకువస్తామన్నారు. అయితే 2018 లో డ్రగ్ కేసులో మజీతియా నిందితుడని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిద్దు ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అకాలీదళ్ నేతలపట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. అవసరమైతే అసెంబ్లీ లో తాను ఓ తీర్మానాన్ని కూడా ప్రతిపాదిస్తానని ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా తాము చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోమని, అవి తమ వ్యక్తిగత వ్యాఖ్యలని మల్వీందర్ సింగ్ మాలి, ప్యారేలాల్ గార్గి ప్రకటించారు. దీంతో సిద్దు ఇరకాటంలో పడ్డారు.వారిపై ఆయన ఏ చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఉత్తరాఖండ్ లో మళ్ళీ విరిగిపడుతున్న కొండచరియలు.. జాతీయ రహదారుల్లో స్తంభించిన రాకపోకలు
Nizamabad : వాచ్‌మెన్‌గా మారిన సర్పంచ్..ఉదయం సర్పంచ్ ..రాత్రి వాచ్‌మెన్ సీట్లో.. వీడియో