Viral Video: నీ క్రియేటివిటీ అదుర్స్ గురూ..! దోశనే బొమ్మ చేశాడు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

|

Mar 05, 2023 | 1:12 PM

వీధివ్యాపారులు కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు రకరకాల వంటకాలను అందుబాటులోకి తెస్తున్నారు. పాత వంటలకే కొత్త రుచులు అద్దుతూ సరికొత్తగా పరిచయం చేస్తున్నారు.

Viral Video: నీ క్రియేటివిటీ అదుర్స్ గురూ..! దోశనే బొమ్మ చేశాడు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Viral Video
Follow us on

వీధివ్యాపారులు కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు రకరకాల వంటకాలను అందుబాటులోకి తెస్తున్నారు. పాత వంటలకే కొత్త రుచులు అద్దుతూ సరికొత్తగా పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇప్పటివరకూ రకరకాల వంటకాలు చూశాం. ఐస్‌క్రీమ్‌ పరోటా, ఫాంట నూడుల్స్‌, ఐస్‌క్రీమ్‌ పానీపూరీ, థమ్స్‌ అప్‌ పానీపూరీ, ఇలా రకరకాల వంటకాలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. తాజాగా ఓ స్ట్రీట్‌ వ్యాపారి సరికొత్త దోశను పరిచయం చేశాడు. దీన్ని చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. సాధారణంగా నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. ఈ దోశ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

సాధారణంగా దోశను మనం వేడి వేడి పెనం మీద రౌండ్‌గా వేస్తాం కదా.. కానీ ఇతను ఈ దోశను రకరకాల షేప్స్‌లో వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇతను టెడ్డీబేర్‌ షేప్‌లో దోశను వేసి కస్టమర్స్‌ మదిని దోచేశాడు. ఈ దోశలు చూసి సామాన్యుల నుంచి బడా వ్యాపారవేత్తలు సైతం ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను నాంది ఫౌండేషన్‌ సీఈవో మనోజ్‌ కుమార్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. పనికి కళాత్మకతను జోడిస్తున్న అతడి నైపుణ్యాన్ని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

అయితే, ఈ వీడియోను షేర్ ఇప్పటికే 3 లక్షల మందికిపైగా వీక్షించారు. పలువురు నెటిజన్లు సైతం అతడి నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..