రెండు వ్యాక్సిన్లు కలిపి ఇచ్చారట , యూపీలోని గ్రామాల్లో వింత ! సైడ్ ఎఫెక్ట్స్ లేవంటూ అధికారుల కప్పదాటు, డాక్టర్లలోనూ అయోమయం

యూపీలోని కొన్ని గ్రామాల్లో ప్రజలకు కోవిషీల్డ్, కొవాగ్జిన్ రెండూ కలిపి (వేర్వేరు డోసులుగానే) ఇఛ్చారు. యూపీ-నేపాల్ సరిహద్దుల్లోని సిధ్దార్థ నగర్ జిల్లాలో ఈ 'వింత' జరిగింది. సుమారు 20 మంది గ్రామీణులకు...

రెండు వ్యాక్సిన్లు కలిపి ఇచ్చారట , యూపీలోని గ్రామాల్లో వింత !  సైడ్ ఎఫెక్ట్స్ లేవంటూ అధికారుల కప్పదాటు, డాక్టర్లలోనూ అయోమయం
Covishield, Covaxin Villagers Get Mixed Shots In Up Village

Edited By: Anil kumar poka

Updated on: May 26, 2021 | 6:08 PM

యూపీలోని కొన్ని గ్రామాల్లో ప్రజలకు కోవిషీల్డ్, కొవాగ్జిన్ రెండూ కలిపి (వేర్వేరు డోసులుగానే) ఇఛ్చారు. యూపీ-నేపాల్ సరిహద్దుల్లోని సిధ్దార్థ నగర్ జిల్లాలో ఈ ‘వింత’ జరిగింది. సుమారు 20 మంది గ్రామీణులకు ఈ రెండు టీకామందులు ఇచ్చారని, అధికారులే అంగీకరిస్తున్నారు. లక్నోకు సుమారు 270 కి.మీ. దూరంలోని ఈ జిల్లాలో గల ఓ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వీరికి మొదట గత ఏప్రిల్ లో మొదటి డోసు కోవిషీల్డ్, రెండో విడతగా ఈ నెల మొదటివారంలో కొవాగ్జిన్ ఇచ్చినట్టు వెల్లడైంది. అయితే ఇది తెలిసిన ఉన్నతాధికారులు ఇది పూర్తిగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యమని, ఇందుకు బాధ్యులైనవారిపై చర్య తీకుంటామని తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు. రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చినప్పుడు అవి చూపగల ప్రభావంపై ఇప్పటివరకు లోతుగా రీసెర్చ్ జరగలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా దీనిపై స్టడీ నిర్వహిస్తున్నారు. కాగా రెండు టీకామందులు తీసుకున్నవారంతా తాము బాగానే ఉన్నామని, తమకెలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని చెప్పారని చౌదరి అనే అధికారి తెలిపారు. వారంతా హెల్దీగానే ఉన్నారని ఆయన వెల్లడించాడు.

అయితే ఒక డాక్టర్ మాత్రం నువ్వు రెండు రకాల వ్యాక్సిన్లు ఎందుకు తీసుకున్నావని, ఇది ప్రాబ్లమ్ కావచ్చునని తనతో వ్యాఖ్యానించినట్టు ఓ గ్రామీణుడు చెప్పాడు. మరి తాను నిరక్షరాస్యుడినని, తనకేమీ తెలియదని ఆ గ్రామీణుడు అమాయకంగా చెప్పాడు. ఏమైనా కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా మందులు రెండు కలిపి ఇచ్చినప్పుడు గుజరాత్ గ్రామాల్లో కొందరిలో అనారోగ్య లక్షణాలు కనబడినట్టు, శరీరంలో అక్కడక్కడా దద్దుర్లు వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇంకా దేశంలో ఇలాంటి వింత కేసులు చాలానే ఉండిఉంటాయని అంటున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ ఇక్కడ : గుంతలో పడిన గున్న ఏనుగు…రక్షించడానికి నానా తంటాలు… చివరకు…?? ( వీడియో )
Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..