India Corona Update: దేశంలో కరోనా విజృంభణ ఏడాది తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24గంటల్లో 7,15,776 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..12,408 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,02,591కి చేరింది. తాజాగా కోవిడ్ బారిన పడి 120 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,54,823కి చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 1.04కోట్ల మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 15,853 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న క్రియా శీలక రేటు 97.16 శాతానికి చేరుకుంది.
దేశ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 20 కోట్లకు చేరువలో ఉంది. గత 24గంటల వరకూ దేశ వ్యాప్తంగా 19.99 కోట్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని కేంద్రం వెల్లడించింది. ఇక మరోవైపు రెండో దశలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూనే.. మొదటి దశలో టీకా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 4 నాటికి 49,59,554 మంది కరోనా టీకా తీసుకున్నారు. నిన్న 5,09,893 మంది ఈ టీకా తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Also Read: