కోవిడ్ వార్డే మ్యారేజ్ హాలుగా మారిన వేళ, వరుడికి పాజిటివ్, చెదరని వధువు, కేరళలో విచిత్రం

కోవిడ్ అంటే మాకేం భయం అంటున్నారు కేరళలో ఓ యువ జంట. దేశంలో  కోవిడ్ మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తున్నవేళ.. తమ పెళ్లి ఘడియలకు ఇవే మంగళవాయిద్యాలని అంటోందీ జంట.

కోవిడ్ వార్డే మ్యారేజ్ హాలుగా మారిన వేళ, వరుడికి పాజిటివ్, చెదరని వధువు, కేరళలో విచిత్రం
Covid Ward At Alappuzha Medical College

Edited By:

Updated on: Apr 25, 2021 | 3:25 PM

కోవిడ్ అంటే మాకేం భయం అంటున్నారు కేరళలో ఓ యువ జంట. దేశంలో  కోవిడ్ మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తున్నవేళ.. తమ పెళ్లి ఘడియలకు ఇవే మంగళవాయిద్యాలని అంటోందీ జంట. అందుకే  కోవిడ్ వార్డులోనే పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అళపుజ జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఈ వార్డు వీరి పెళ్లి వేదిక  అయింది. శరత్ మోన్, అభిరామి అనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ జిల్లాలోని కైనకారి ప్రాంతానికి చెందిన వీరు చాలా రోజులుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇక ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం పెళ్లి సన్నాహాల్లో ఉండగానే  శరత్ కరోనా వైరస్ పాజిటివ్ బారిన పడ్డాడు. ఆ తరువాత అతని తల్లికి కూడా పాజిటివ్ సోకింది. ఈ తల్లీ కొడుకులిద్దరినీ ఆళపుజ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేర్చారు. ఏమైనా తమ పెళ్లి మాత్రం నిలిచిపోరాదని అభిరామి పట్టుబట్టింది. దీంతో వీరి వివాహాన్ని ఏప్రిల్ 25 (ఆదివారం) న జరపాలని రెండు కుటుంబాలూ నిర్ణయించాయి.

జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల అనుమతితో అభిరామి ఈ వార్డులోకి పెళ్లి కూతురులా  వచ్చింది . పీపీఈ కిట్ ధరించి వచ్చిన ఈమెకు శరత్ తల్లి పూల దండలు ఇచ్చింది. శరత్, అభిరామి ఇద్దరూ వాటిని మార్చుకున్నారు. అంతే ! వీరి వివాహం ఈ వార్డులోనే జరిగిపోయింది. నిరాడంబరంగా, అందులోనూ కోవిడ్ వాగులో ఈ పెళ్లి తంతు జరగడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: హీరోహీరోయిన్లపై మండిపడ్డ సీనియర్ యాక్టర్ నవాజుద్దీన్.. కొంచెమైనా సిగ్గుండాలి అంటూ ఫైర్..

Gopichand New Movie: ‘అలిమేలుమంగ వేంకటరమణ’గా గోపీచంద్.. అతిధిగా వస్తానంటున్న రానా ?