గంగానదిలో కొట్టుకొచ్చిన 40 మృతదేహాలు, కోవిడ్ భయంతో బీహార్ వాసుల్లో భయాందోళనలు, యూపీపై అనుమానాలు

| Edited By: Phani CH

May 10, 2021 | 6:54 PM

బీహార్ లోని బక్సర్ జిల్లావాసులు సోమవారం ఉదయం నిద్ర లేచి గంగానదిని చూడగానే హడలిపోయారు. కారణం ? దాదాపు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న సుమారు 40 మృతదేహాలు నదిలో తేలియాడుతూ కనిపించాయి.

గంగానదిలో కొట్టుకొచ్చిన 40 మృతదేహాలు,  కోవిడ్ భయంతో బీహార్ వాసుల్లో భయాందోళనలు, యూపీపై అనుమానాలు
Covid Panic In Bihar Town
Follow us on

బీహార్ లోని బక్సర్ జిల్లావాసులు సోమవారం ఉదయం నిద్ర లేచి గంగానదిని చూడగానే హడలిపోయారు. కారణం ? దాదాపు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న సుమారు 40 మృతదేహాలు నదిలో తేలియాడుతూ కనిపించాయి. నది ఒడ్డున కొన్ని కనబడ్డాయి. దీంతో ముఖ్యంగా చౌసా టౌన్ ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ టౌన్ పొరుగున ఉన్న యూపీ రాష్ట్రానికి ఆనుకుని ఉంది. ఆ రాష్ట్రంలో కోవిద్ కి గురై మృతి చెందిన తమవారిని దహనం చేసేందుకు లేదా ,ఖననం చేసేందుకో వీలులేక, శ్మశాన వాటికలు లేకకూడా వీరి బంధువులు ఇలా గంగానదిలో విసిరి వేసి ఉంటారని భావిస్తున్నారు.తాను సుమారు 45 మృత దేహాలను గమనించానని మహాదేవ్ ఘ్జాత్ దగ్గర జిల్లా అధికారి ఒకరు చెప్పారు. ఈ ఘాట్ వద్ద కొన్ని డెడ్ బాడీలు పడి ఉన్నాయి. అసలు వంద డెడ్ బాడీలు కనబడినా ఆశ్చర్యం లేదని ఆయన అంటున్నారు. ఇవి నది నీటిలో 5 రోజులు గానీ 7 రోజులు గానీ ఉండి ఉంటాయని, ఐవి కచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవలసి ఉందని మరో అధికారి అన్నారు. ఏమైనా ఈ మృత దేహాల కారణంగా కోవిడ్ తమకు ఎక్కడ అంటుకుంటుందోనని స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వీటినివెంటనే దహనం చేయాలనీ కోరుతున్నారు. డెడ్ బాడీల తరలింపు, దహనం చేస్తే తమకు 500 రూపాయలిస్తామని అధికారులు అంటున్నారని స్థానికుడొకరు చెప్పారు.

అటు యమునా నదిలో కూడా కొన్ని డెడ్ బాడీలు కొట్టుకువచ్చాయని తెలుస్తోంది. యూపీలోని హామీర్ పూర్ జిల్లాలో ఈ వైనం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కోవిడ్ భయంతో తాము వణికిపోతున్నామని, ఇప్పుడు ఈ నదిలో ఈ డెడ్ బాడీలు కనిపించడంతో భయపడిపోతున్నామని వారు పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Trolls On Cricketer: నువ్వు ఇచ్చిన డ‌బ్బులకు ఒక్క వెంటిలేట‌ర్ కూడా రాదు.. చౌహాల్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్‌..

VACCINE PATENT-RIGHTS: శరవేగంగా వ్యాక్సిన్ పంపిణీకు మోదీ కొత్త ఎత్తు… అమెరికా ఓకే.. కానీ ఈయూ దేశాల మోకాలడ్డు!