Covid Cases: కేరళలోని మలప్పురం జిల్లాలోనే కోవిడ్ కేసులు అత్యధికం.. ఎందుకంటే ..?

| Edited By: Phani CH

Aug 12, 2021 | 7:38 PM

కేరళలోని 14 జిల్లాలలకు గాను 10 జిల్లాల్లో కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్నాయి. మలప్పురం, కసర గడ్, పథనంతిట్ట, వయనాడ్, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, కొట్టాయం, కోజికోడ్, అలపుజా జిల్లాల్లో ఇవి ఎక్కువగా ఉన్నప్పటికీ మలప్పురం లోని కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Covid Cases: కేరళలోని మలప్పురం జిల్లాలోనే కోవిడ్ కేసులు అత్యధికం.. ఎందుకంటే ..?
Corona Virus
Follow us on

కేరళలోని 14 జిల్లాలలకు గాను 10 జిల్లాల్లో కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్నాయి. మలప్పురం, కసర గడ్, పథనంతిట్ట, వయనాడ్, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, కొట్టాయం, కోజికోడ్, అలపుజా జిల్లాల్లో ఇవి ఎక్కువగా ఉన్నప్పటికీ మలప్పురం లోని కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ జిల్లాలో గత వారం రోజులుగా అత్యధిక కేసులు నమోదయ్యాయి. రోజుకు మూడున్నర వేల నుంచి నాలుగు వేలవరకు నమోదవుతున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఆదివారం సుమారు మూడు వేలు, అంతకుముందు 4 వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో పాజిటివిటీ రేటు 35.7 శాతం ఉంది. మొత్తం 27,537 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజిత్ సింగ్ ఆధ్వర్యాన 5 గురు సభ్యుల బృందం గురువారం ఈ జిల్లాను సందర్శించి కేసుల అదుపునకు అధికారులు తీసుకుంటున్న చర్యలను, హాస్పిటల్స్ పని తీరును, వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షించింది. జిల్లాలో ఎక్కువ కేసులకు కారణం హోం క్లష్టర్స్ అని నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఎవరికైనా పాజిటివ్ సోకినప్పుడు హోం ఐసోలేషన్ తప్పనిసరి అని, కానీ ఐసోలేషన్ లో ఉన్నవారిని జిల్లా అధికారులు మానిటరింగ్ చేయడం లేదని ఈ బృందం గుర్తించింది.అలాగే హోం ఐసోలేషన్ లో ఉన్నవారు కూడా కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని కూడా వీరు తెలుసుకున్నారు.

జిల్లాలో కేసులు పెరగడానికి ఇలా చాలా కారణాలు ఉన్నాయని వీరు పేర్కొన్నారు. కాగా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వస్తున్న వారివల్ల సైతం ఇవి పెరుగుతున్నాయని జిల్లా వైద్య అధికారి కె.సకీనా తెలిపారు. ప్రతివారినీ గుర్తించడం కష్టమన్నారు. ఏమైనప్పటికీ ఈ జిల్లాలో కోవిడ్ అదుపునకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ కె.గోపాలకృష్ణన్ వివరించారు. అటు- రాష్ట్రంలో రికవరీ రేటు తక్కువగా ఉన్న జిల్లా కూడా ఇదే. రాష్ట్ర సగటు ఎవరేజీలో ఇది 20 శాతం తక్కువ.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: నీరజ్‌ చోప్రాను ఎక్కిరించిన హీరోయిన్..!! ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?? వీడియో

Fake Challans: ప్రైవేటు దోపిడీ ప్రభుత్వం సీరియస్.. ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సోదాల్లో వెలుగులోకి సంచలనాలు..!