యూపీలో కోవిద్ కేసులు తగ్గుతునందున జూన్ 1 నుంచి అన్-లాకింగ్ ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 1 నుంచి కరోనా కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్.కె. తివారీ తెలిపారు. 600 కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్న జిల్లాల్లో కోవిద్ ఆంక్షలను సడలించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. కానీ ఇంతకు మించి కేసులు ఉన్న జిలాల్లో మరో వారం రోజులపాటు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. 600 కన్నా తక్కువ కేసులు నమోదైతే యధాప్రకారం ఆంక్షల సడలింపు ఉంటుందని ఆయన వివరించారు. మొత్తం 55 జిల్లాల్లో ఆంక్షలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు సడలిస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1900 కోవిద్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. యాక్టివ్ కేసులు 41 వేలకు తగ్గాయన్నారు. కాగా యాక్టివ్ కేసులు ఇంకా ఎక్కువే ఉన్న లక్నోలోను, మరికొన్ని జిల్లాల్లోనూ కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. దేశంలోనే తమ రాష్ట్రంలో కోవిద్ మరణాల సంఖ్య తక్కువగా ఉందని ఆయన అన్నారు. లోయెస్ట్ పాజిటివిటీ, హయ్యెస్ట్ రికవరీ రేటు ఉందని ఆయన వివరించారు. నూతన సడలింపుల ప్రకారం ఈ 55 జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు మార్కెట్లు, దుకాణాలను తెరిచి ఉంచుతారు.
అయితే ప్రైవేటు కార్యాలయాలు సగం మంది సిబ్బందితో పని చేయవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఆయా ఫ్యాక్టరీలు అన్ని ప్రొటొకాల్స్ పాటిస్తూ పని చేస్తాయని వివరించింది. అటు కోవిద్ కేసులు ఇంకా తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : సన్నిలియోన్ ఇంటికి పక్కనే ఇల్లు కొన్న మెగాస్టార్..తక్షణమే రిజిస్ట్రేషన్ కావాలంటూ పట్టుపట్టిన హీరో :Mumbai Video.
Cyberabad Police : పోలీస్ సిబ్బందిపై దాడి.. క్లారిటీ ఇచ్చిన సైబరాబాద్ పోలీస్.!(వీడియో).
Rang De: నితిన్ కీర్తి సురేష్ రంగ్ దే మూవీ ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే…?? ( వీడియో )