Covid 19 Vaccine Latest Updates: అలాంటి వారికి వ్యాక్సీన్ వేయకండి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక లేఖ..!

|

Jan 22, 2022 | 9:32 AM

Covid 19 Vaccine Latest Updates: కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులకు బూస్టర్ డోస్ ఇచ్చే అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు

Covid 19 Vaccine Latest Updates: అలాంటి వారికి వ్యాక్సీన్ వేయకండి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక లేఖ..!
Vaccine
Follow us on

Covid 19 Vaccine Latest Updates: కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులకు బూస్టర్ డోస్ ఇచ్చే అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు తాజాగా రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే 3 నెలల వరకు బూస్టర్ డోస్/ ముందుజాగ్రత్త డోస్ వేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర వైద్యారోగ్య శాఖ. కరోనా సోకిన వ్యక్తులు కోలుకున్న తర్వాత వచ్చే 3 నెలల వరకు వారికి ఎలాంటి వ్యాక్సీన్‌లు ఇవ్వకూడదని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో.. దేశంలో బూస్టర్ డోస్/ప్రికాషన్ డోస్ ను వేయడం ప్రారంభించారు.

ఇదే అంశంపై కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ షెల్లీ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు ప్రికాషన్ డోస్ ఇవ్వడంపై మార్గదర్శకాల కోసం వివిధ వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చాయన్నారు. ఈ మేరకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందన్నారు. ‘‘దయచేసి గమనించండి. ల్యాబ్ పరీక్షల ద్వారా కరోనా సోకినట్లు నిర్ధారించబడిన వారికి, SARS-2 COVID-19 నుండి కోలుకున్న తర్వాత, ప్రికాషన్ డోస్ సహా అన్ని రకాల కోవిడ్ టీకాలు తదుపరి 3 నెలల పాటు నిలిపివేయబడతాయి.’’ అని స్పష్టం చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

దేశంలో 2 మిలియన్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 3,37,704 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిన్న వెల్లడించింది. దేశంలో కరోనా యాక్టీవ్ కేసులు 21,13,365 కు పెరిగింది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉంది. ఇక 24 గంటల్లో 2,42,676 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒక్క రోజులో 488 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Also read: