Corona Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టిన ఈ వ్యాక్సిన్ పంపిణీ ఆరో రోజు కొనసాగింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 9,99,065 మందికి టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోజు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిన ప్రాంతాల్లో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో 1,92,581 మందికి టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని వెల్లడించారు. అయితే గురువారం టీకా వేయించుకున్నవారిలో తెలంగాణ నుంచి 26,441 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 15,507 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్ టీకాలు ఎంతో సురక్షితం, సమర్థవంతమైనవన్నారు. ఎవరు కూడా వీటిపై అసత్యాలను , వందతులను నమ్మవద్దని సూచించారు. కరోనా మహమ్మారి కట్టడిలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అలాగే జనవరి 16న దేశ వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కరోనాపై పోరులో ముందుండి పని చేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పోలీసులకు తొలి ప్రాధాన్యతగా టీకాలు అందించారు. రెండో విడతలో ప్రధాన మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీకా అందించనున్నట్లు తెలుస్తోంది.
Also Read:
సీరమ్ ఇన్‌స్టిట్యుట్ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి.. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన సంస్థ సీఈవో