Pediatric Wards: దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తోంది. ఇప్పటికే సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరికొన్ని రోజుల్లో థర్డ్ వేవ్ ముప్పు తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య నాలుగు లక్షల వరకు నమోదవుతుండగా.. మరణాలు దాదాపు నాలుగువేలకు చేరువలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ముప్పు తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ థర్డ్ వేవ్ అత్యధికంగా పిల్లలపై ప్రభావం చూపే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ( బిఎంసి ), మహారాష్ట్ర ప్రభుత్వం నగరంలో, ఇతర ప్రాంతాలలో పీడియాట్రిక్ కోవిడ్ కేర్ వార్డులను ఏర్పాటు చేయడంపై దృష్టిసారించాయి.
ఈ కరోనా మ్యుటేషన్లు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో పీడియాట్రిక్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గత వారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్‌ను నియంత్రించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా కరోనా పిల్లలను దెబ్బతీసే అవకాశముందని ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని కోరారు.
కాగా.. మహరాష్ట్రలో ఇటీవల కాలంలో 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. భారీగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో కొనసాగుతోంది. కరోనా నియంత్రణ కోసం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటోంది.
Also Read: