India Covid-19 third wave: భారత్‌లో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో దేశమంతటా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. సెకండ్ వేవ్‌తోనే పరిస్థితులు దిగజారుతున్న వేళ.. తాజాగా ప్రభుత్వ సలహాదారు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తప్పదని సూచించారు. దానికోసం ముందస్తుగా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా.. థర్డ్ వేవ్ మాత్రం వస్తుందని.. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటూ వెల్లడించారు.
ఈ మేరకు డాక్టర్ కె. విజయరాఘవన్ బుధవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్ థర్డ్ తప్పదని పేర్కొన్నారు. భారతదేశంలో మహమ్మారి అడ్డుకట్టకు, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని.. మూడో దశ కూడా తప్పదని పేర్కొన్నారు. అయితే థర్డ్ వేవ్ ఏ సమయంలో వస్తుందో స్పష్టంగా చెప్పలేమన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన మార్గదర్శకాలు అవసరమని డాక్టర్ కె. విజయరాఘవన్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనావైరస్ కేసులు పెరడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగం కేసులు భారత్‌లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కాగా.. గత 24 గంటలలో దేశంలో అత్యధిక కరోనా మరణాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 3,780 మంది మరణించగా.. 3.82 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో నమోదైన కేసుల్లో 46 శాతం కేసులు నమోదుకాగా.. మరణాలలో నాలుగింట ఒక వంతు సంభవిస్తున్నాయి.
Also Read: