COVID-19 norms violated: బీజేపీ నేత అల్లుడి పెళ్లి.. కరోనా నిబంధనలు బేఖాతరు.. ఝలక్ ఇచ్చిన పోలీసులు..

|

Dec 29, 2020 | 4:14 PM

అధికారం మాది.. మేం ఏం చేసిన చెల్లుబాటు అవుతుంది అని అనుకున్నారేమో. ఓ బీజేపీ నేత అల్లుడి పెళ్లి వేడుకలో కొందరు..

COVID-19 norms violated: బీజేపీ నేత అల్లుడి పెళ్లి.. కరోనా నిబంధనలు బేఖాతరు.. ఝలక్ ఇచ్చిన పోలీసులు..
Follow us on

COVID-19 norms violated: అధికారం మాది.. మేం ఏం చేసిన చెల్లుబాటు అవుతుంది అని అనుకున్నారేమో. ఓ బీజేపీ నేత అల్లుడి పెళ్లి వేడుకలో కొందరు వ్యక్తులు కరోనా నిబంధనలను బేఖాతరు చేశారు. అయితే.. చట్టం ఎవరికీ చుట్టం కాదంటూ కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా ఓవర్ యాక్షన్ చేసిన వారికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. గుజరాత్‌లోని వల్సద్ జిల్లాలో బీజేపీ నేత చేతన్ వందు మేనల్లుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లికి హాజరైన పలువురు కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేశారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి డ్యాన్సులు చేశారు. దాదాపు వంద మందికి పైగా గుమిగూడగా వారిలో ఏ ఒక్కరికీ సరిగ్గా మాస్క్ లేదు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రధాన కారణమైన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వల్సద్ జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు.

 

Also read:

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‏కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేసిన జోగినిపల్లి సంతోష్..

పీఎంసీ బ్యాంక్ స్కామ్ లో ఈడీ ఎదుట హాజరు కాని శివసేన నేత సంజయ్ రౌత్ భార్య వర్ష, మరింత వ్యవధి కావాలని అభ్యర్థన